»   » మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్‌కు అనుకూలంగా సెన్సార్!

మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్‌కు అనుకూలంగా సెన్సార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ అయిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా అనుకూలంగా రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 31న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో మోహన్ బాబు టూరిస్ట్ గైడ్ గా కనిపించనున్నారని చెప్తున్నారు. తన పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని,తన పాత్ర తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మోహన్ బాబు. అలాగే చిత్రం దాదాపు 30 కోట్లు దాకా బడ్జెట్ అయ్యిందని మోహన్ బాబు చెప్తున్నారు.

Pandavulu Pandavulu Thummedha

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
The Manchu Multistarrer ‘ Pandavulu Pandavulu Thummedha’ has been given a U/A by the censor board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu