twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది వల్గర్ మూవీ, పీకీ కొట్టాలనిపిస్తుంది, సెక్సువాలిటీ అవసరమే కానీ... : మంచు లక్ష్మి

    By Bojja Kumar
    |

    Recommended Video

    Manchu Lakshmi Makes Serious Comments On Movies

    'వైఫ్ ఆఫ్ రామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు లక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల్లో మారుతున్న ధోరణి, టాలీవుడ్ మూవీస్‌లో సెక్సువాలిటీ చూపించడం లాంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కొన్ని సందర్భాల్లో సెక్సువాలిటీని చూపించడం అవసరమే, కానీ సెక్సువాలిటీ పేరుతో వల్గారిటీ చూపించడం నాకు అస్సలు నచ్చదు, అలాంటి సినిమాలు నేను చేయడానికి ఇష్టపడను అని మంచు లక్ష్మి తెలిపారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉందని, అయినా కోట్లు వసూలు చేస్తోందని విన్నాను... అని వ్యాఖ్యానించారు.

    అలాంటి సినిమాలకు నాకు అవసరం లేదు

    అలాంటి సినిమాలకు నాకు అవసరం లేదు

    వల్గారిటీ అనేది ఎవరికైనా అభ్యంతరకరమే. మేము సైతం లాంటి షోలు చేసి.... అలాంటి సినిమాలు చేయాలని అస్సలు కోరుకోవడం లేదు. నాకు వద్దు కూడా. దాని వల్ల మన విలువ పోతుంది అని మంచు లక్ష్మి తెలిపారు.

    అర్జున్ రెడ్డి-ఆర్ఎక్స్ 100

    అర్జున్ రెడ్డి-ఆర్ఎక్స్ 100

    అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల ప్రస్తావన వచ్చినపుడు మంచు లక్ష్మి స్పందిస్తూ... ‘అర్జున్ రెడ్డి' వల్గర్ ఫిల్మ్ కాదు, అది రియల్ కల్ట్ ఫిల్మ్ అంటూ మంచు లక్ష్మి కితాబిచ్చారు. రెండో సినిమాలో వల్గారిటీ ఎక్కువ ఉందని విన్నాను. నేను చూడలేదు. అందుకే కామెంట్ చేయదలుచుకోలేదన్నారు.

    సెక్సువాలిటీ, వల్గారిటీ మధ్య చాలా తేడా ఉంది

    సెక్సువాలిటీ, వల్గారిటీ మధ్య చాలా తేడా ఉంది

    తెలుగు సినిమాల్లో సెక్సువాలిటీ చూపించడంలో తప్పులేదు, వల్గర్‌గా చూపించడమే ఇక్కడ సమస్య. అర్జున్ రెడ్డి చూశాను... చాలా బాగా నచ్చింది. అందులో రియల్ ఎమోషన్స్ చూపించారు. సెక్సువాలిటీ, వల్గారిటీ మధ్య చాలా తేడా ఉందని మంచు లక్ష్మి తెలిపారు.

    ఉమెన్‌ను బ్యాడ్‌గా చూపించడం నచ్చదు

    ఉమెన్‌ను బ్యాడ్‌గా చూపించడం నచ్చదు

    ఆ సినిమా (ఆర్ఎక్స్ 100)లో ఉమెన్‌ను బ్యాడ్‌గా చూపించారని విన్నాను. అలాంటివి నాకు నచ్చదు. సినిమా ఆడుతోంది, వారికి డబ్బులు వస్తున్నాయి అంతా బావుంది. కానీ నాకు అలాంటి సినిమాలు చేయడం ఇష్టం ఉండదు.

    మంచి సినిమాలు కూడా ఆడుతున్నాయి

    మంచి సినిమాలు కూడా ఆడుతున్నాయి

    వల్గారిటీ చూపిస్తేనే జనాలు చూస్తారు అనుకోవడం తప్పు. పెళ్లి చూపులు అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. క్షణం, మహానటి మంచి వసూళ్లు సాధించింది అని మంచు లక్ష్మి గుర్తు చేశారు.

    పీకి కొట్టాలనిపిస్తుంది

    పీకి కొట్టాలనిపిస్తుంది

    మహిళల పట్ల చెడుగా ప్రవర్తించే వారంటే తనకు అసహ్యమని మంచు లక్ష్మి తెలిపారు. కొందరు మనం నడుచుకుంటూ వెళుతుంటే అసభ్యం తాకుతూ వెళతారు. అదేం ఆనందమో అర్థం కాదు. నేను ముసుగేసుకుని ఓల్డ్ సిటీకి వెళ్లిపుడు ఇలాంటి ఎదురయ్యాయి. వాళ్లకు నేను ఎవరో కూడా తెలియదు. చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థమైంది. అలాంటపుడు మొహం మీద పీకి కొట్టాలనిపిస్తుంది.

    ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనేది నేర్పాలి

    ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనేది నేర్పాలి

    పిల్లలకు చిన్నతనం నుండి ఇంట్లో, స్కూల్లో ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనేది నేర్పించాలి. అప్పుడే చిన్న పిల్లల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారు దాన్ని అర్థం చేసుకుని పేరెంట్స్‌కు చెప్పే స్థాయికి వస్తారు అని మంచు లక్ష్మి తెలిపారు.

    English summary
    Lakshmi Manchu liked ‘Arjun Reddy‘ as it’s a real cult movie that showed an eccentric guy. It’s about real emotions and not vulgarity. But, the other movie (Rx 100) portrayed women as bad and has been collecting crores. That’s her opinion on sexuality and vulgarity and it’s evident that she didn’t like the portrayal of the main female lead in ‘Rx 100’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X