»   » “మగాడయితే మోహన్ బాబు అయ్యేది” అంటున్నారు (వీడియో)

“మగాడయితే మోహన్ బాబు అయ్యేది” అంటున్నారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "మగాడయితే మోహన్ బాబు అయ్యేది" అనే ఈ డైలాగు ఎవరి గురించి అంటున్నారా..ఇంకెవరు ఆయన కుమార్తె ..మంచు లక్ష్మి ని ఉద్దేసించి అన్నది. ఎవరు ఈ డైలాగు..ఎందుకు ..ఏ సందర్భంలో అన్నారో తెలియాలంటే ఈ క్రింద వీడియో చూడాల్సిందే.


మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించి, నిర్మిస్తున్న సినిమా ‘దొంగాట'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ ని పెంచారు. థియోటర్ ట్రైలర్ ని వదిలారు. అటు బ్రహ్మానందం, రానా గెస్ట్ రోల్, లక్ష్మీ మంచు ఫెరఫార్మెన్స్ హైలెట్ గా ఈ ట్రైలర్ రూపొందింది. అలాగే ఈ చిత్రం కోసం మంచు లక్ష్మి చేత తొలిసారిగా ఓ పాట పాడించారు. "యాందిరో మీ మగాళ్లలో అంత ఇర్రవీగిపోయే గొప్ప..." అంటూ సాగే మంచి పేరు తెచ్చుకుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


లక్ష్మి మంచు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుండి ఇదివరకు వచ్చిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ‘గుండెల్లో గోదారి' సినిమాలకు భిన్నంగా ‘దొంగాట' వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో ఓ ప్రత్యేక సందర్భంలో నాగార్జున, రవితేజ, రానా, నాని, శింబు, సుధీర్‌బాబు, నవదీప్‌, సుశాంత్‌, తాప్సీ పలువురు కనిపిస్తారు. ఓ కీలక సన్నివేశం కోసం వారిని అడగ్గానే ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ చక్కని కథ చెప్పాడు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.


Manchu lakshmi Dongaata Telugu Movie Theatrical Trailer

వంశీకృష్ణ మాట్లాడుతూ ‘‘మాటల సందర్భంలో లక్ష్మికి కథ చెప్పాను. వెంటనే చేసేద్దాం అంది. కామెడీ నేపథ్యంలో ఇదొక కొత్త సినిమా అవుతుంది'' అని అన్నారు. ‘‘తొలిసారి కామెడీ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఇదొక కొత్త అనుభూతి. ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ అవుతుంది'' అని అడివి శేష్‌ తెలిపారు.


‘గుండెల్లో గోదారి' లాంటి ఫీల్ గుడ్ మూవీ తర్వాత మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తాను నిర్మిస్తున్న సినిమా ఇదని లక్ష్మీ మంచు తెలిపారు. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో నాగార్జున, రవితేజ, రానా, శింబు సహా పది మంది హీరోలు నటించబోతున్నారని, అన్నీ అనుకూలిస్తే... ఏప్రిల్ 16న సినిమాను విడుదల చేస్తామని మంచు లక్ష్మి తెలిపారు!


క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

English summary
Dongata Telugu Movie Theatrical Trailer released, starring Lakshmi Manchu, Adivi Sesh, Brahmanandam, Madhu Nandan, JP, Giri Babu, Anapurnamma, Pruthvi. For the first time ever, Lakshmi Manchu has crooned for a song. The song will be featured in the movie “Dongata”, a kidnap comedy, and directed by newcomer Vamsi Krishna.
Please Wait while comments are loading...