»   »  మంచు లక్ష్మి వెరీ ఫన్నీ... అనుష్క షేర్ చేసింది (వీడియో)

మంచు లక్ష్మి వెరీ ఫన్నీ... అనుష్క షేర్ చేసింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క నటించిన ‘సైజ్ జీరో' ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన డైలాగుతో మంచు లక్ష్మి చేసిన డబ్‌స్మాష్ వీడియో ఆకట్టుకుంటోంది. అనుష్క తన సోషల్ మీడియా పేజీ ద్వారా దీన్ని షేర్ చేయడం విశేషం.

Hahhaa... Lakshmi... You nailed it! Thanks for the love..


Posted by Anushka Shetty on Monday, November 23, 2015

అనుష్క,ఆర్య ప్రధాన పాత్రలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైజ్ జీరో'. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామోడీ ఎంటర్టెనర్ గా సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్లీన్ ‘యు' సర్టిఫికెట్ వస్తుందని అంతా ఊహించారు. అంతని ప్రేక్షకుల అంచనాలను భిన్నంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ' సర్టిపికెట్ జారీ చేసింది.


ఈ సినిమాకు ‘యు/ఎ' రావడంతో ఫిల్మ్ నగర్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఆర్య, అనుష్క మధ్య లిప్ కిస్ సీన్ ఉందని, అందుకే ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చారని కొందరు.... గతంలో పలు తెలుగు చిత్రాల్లో బికినీ అందాలతో సెక్సీగా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ డోసు ఈ చిత్రంలో కూడా బాగానే ఉందని, అందుకే ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు.


 Manchu Lakshmi 'Size Zero' movie Dubsmash

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి', ‘రుద్రమదేవి' వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో విలక్షణమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో నవంబర్ 27న మన ముందుకు రానుంది.


‘ఇంజి ఇడుపళగి' అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా నవంబర్ 27నే విడుదల కానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో, ట్రైలర్ నవంబర్ 1న విడుదలయ్యాయి. ఆడియో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.


అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.


English summary
"Hahhaa... Lakshmi... You nailed it! Thanks for the love" said Anushka about Manchu Lakshmi Size Zero movie Dubsmash.
Please Wait while comments are loading...