»   » మంచు లక్ష్మి పాలిటిక్స్: మొన్న మోడీ, ఇపుడు తమ్ముడు!

మంచు లక్ష్మి పాలిటిక్స్: మొన్న మోడీ, ఇపుడు తమ్ముడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి తెలివిగా ముందుకు సాగడమే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈవిడ ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా....రాజకీయాలకు సంబంధించని అంశాలపై తనదైన రాజకీయం చేస్తోంది.

కొన్ని రోజుల క్రితం మొడీ హైదరాబాద్ రావడంతో స్వయంగా వెళ్లి కలిసిన మంచు లక్ష్మి....ఆయనకు తన మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, మోడీకి మాత్రం తన సపోర్టు ఉంటుందని స్పష్టం చేసింది.

తాజాగా మంచు లక్ష్మి విజయవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్‌తో దిగిన ఫోటోను తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. 'నా తమ్ముడు దేవినేని అవినాష్ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తుండటం గర్వంగా ఉంది' అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

అవినాష్‌తో...

అవినాష్‌తో...


విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌తో మంచు లక్ష్మి.

నరేంద్ర మోడీతో...

నరేంద్ర మోడీతో...


ఆ మధ్య బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన మంచు లక్ష్మి.

మాస్టర్ ప్లాన్

మాస్టర్ ప్లాన్


ఇలా అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు నెరపడం ద్వారా తన భవిష్యత్తులో జరిగే పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే మాస్టర్ ప్లాన్‌తో మంచు లక్ష్మి ముందు సాగుతుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు

నిర్మాత కోణంలో ఆలోచిస్తే..

నిర్మాత కోణంలో ఆలోచిస్తే..


సినిమా రంగంలో నిర్మాతగా ఉన్న వారికి రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండటం ఏదో ఒక సందర్భంలో లాభిస్తుందని అంటున్నారు.

English summary
"Back in hyd. So proud of my brother Devineni Avinash for his MP seat in Vijaywada. ATB ..!!" Manchu Lakshmi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu