For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక్క శాతం కూడా బాధపడలేదు: మంచు లక్ష్మి ప్రసన్న

  By Srikanya
  |

  హైదరాబాద్ : నా సన్నివేశాలను కత్తిరించారని ఒక్క శాతం కూడా బాధపడలేదు. మణిరత్నం గారికి ఏం చేయాలో, ఎలా చేయాలో బాగా తెలుసు. సినిమా బాగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకొంటారాయన. కాకపోతే.. 'నువ్వు నటించిన పాట తొలగిస్తున్నాం...' అని నాతో చెప్పలేదు. అదొక్కటే బాధ. చెబితే బాగుండేది అంటున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. 'కడలి' లో ఆమె చేసిన సన్నివేశాలు తొలిగించారు. ఈ విషయమై ఆమె ఇలా స్పందించారు.

  అలాగే... 'కడలి' ఫలితం నిరుత్సాహపరిచలేదు. ఏ సినిమా అయినా బాగా ఆడాలనే కష్టపడతాం. మనం అనుకొన్నట్టు జరక్కపోతే నిరుత్సాహపడిపోకూడదు. అలాగైతే సినిమాలు చేయలేం అన్నారామె. అలాగే నాకెప్పుడూ డీ గ్లామర్ పాత్రలే దక్కాయి. బయట ఇంత ట్రెండీగా కనిపిస్తాను కదా? నన్ను నేను తెరపై చూసుకొంటే నాకే కొత్తగా అనిపించింది అని చెప్పారు.

  'గుండెల్లో గోదారి' చిత్రం గురించి చెప్తూ...చిత్రం ముక్కోణపు ప్రేమ కథ అని అనుకోవచ్చు. అయితే ఆ ప్రేమకథలోని మలుపులు తప్పకుండా ఆకట్టుకొంటాయి. ఇరవై ఏళ్ల క్రితం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో వాతావరణం ఎలా ఉండేది? ఎలాంటి దుస్తులు వేసుకొనేవారు... ఇలాంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాం. ఆఖరికి అప్పటి పోస్టర్లనూ వదల్లేదు. గోడల మీద ఆ కాలం నాటి సినిమా బొమ్మలే కనిపిస్తాయి. ఈ సినిమా కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. సెట్‌కి వెళ్లకముందే ట్రైల్‌ షూట్‌ చేశాం. ఎందుకంటే గోదారి నీళ్లలో కెమెరాని ఎలా ఉపయోగించాలో మాకు తెలీదు. ఇలాంటి ప్రాథమిక విషయాలపై అవగాహన తెచ్చుకొన్నాకే రంగంలోకి దిగాం అన్నారు.

  అలాగే నగర వాతావరణానికి అలవాటు పడిపోయాం. మన సినిమాల్లోనూ అదే చూపిద్దాం అనుకొంటే.. అవన్నీ ఇక్కడి ప్రేక్షకులకే పరిమితం అయిపోయే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలూ రావాలి. ఈ సినిమాతో గోదారి తీరంలోని మనుషులతో గడిపే అవకాశం వచ్చింది. వాళ్ల ప్రపంచం వేరు. మనమంతా సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ అంటూ వీటి చుట్టూనే బతుకుతున్నాం. చేపల కూర రుచి, కోడి పందాల జోరు.. ఇవన్నీ అనుభవంలోకి వచ్చాయి అని అనుభవాలు వివరించారు. లక్ష్మీప్రసన్న నటిస్తూ నిర్మించిన 'గుండెల్లో గోదారి' ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Gundello Godari is an upcoming Telugu and Tamil bilingual film being directed by Kumar Nagendra and produced by Lakshmi Manchu. The film features Lakshmi, Aadhi and Taapsee Pannu in the lead roles. The movie is slated for a release on 8 March 2013 along with Tamil version Maranthen Mannithen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X