For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారికి నా పేరు వాడుకొనే ఉద్దేశమే: మంచు లక్ష్మి ప్రసన్న

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'అనగనగా ఓ ధీరుడు' తరవాత విలన్ పాత్రలు కాదు కానీ... హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే వచ్చాయి. కానీ నాకున్న కొద్దిపాటి అవగాహనతో ఆలోచిస్తే.. ఆ సినిమాల్లో నా పేరు వాడుకొని మార్కెట్‌ చేసుకొనే ఉద్దేశమే కనిపించింది. నా సంతృప్తి ముఖ్యం. నటిగా ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాంటి కథలే ఒప్పుకొంటా అన్నారు మంచు లక్ష్మి ప్రసన్న. 'అనగనగా ఓ ధీరుడు'లో ఐరేంద్రి పాత్రతో 2011 ఉత్తమ ప్రతినాయిక నందికి ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారామె.

  'మోహన్‌బాబు కూతురేంటి? సినిమాల్లో నటించడమేమిటి?' అని చాలామంది అనుకొన్నారు. ఆ మాటలే నాకు సవాల్‌ విసిరాయి. 'ఎందుకు నటించకూడదు?' అనే పంతం వచ్చింది. ఇప్పుడు నందితో వారందరికీ సమాధానం చెప్పాననిపిస్తోంది. అందరిలా ఈ పురస్కారం ఎవరెవరికో అంకితం ఇవ్వదలుచుకోలేదు. ఇది నా నంది. నంది ఫలితాలు వెలుబడినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. చిన్నికృష్ణ గారు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ క్షణమే ఎగిరి గంతేయాలనిపించింది. అక్కడి నుంచి వరుసగా ఎన్ని ఫోన్లో. నిజంగానే ఎలా ప్రతిస్పందించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నారు.

  అలాగే ప్రతినాయికగా అడుగుపెడితే.. జీవితాంతం ఆ ముద్రే పడిపోతుందేమో అని నిజంగానే భయపడ్డా. కానీ నాకు నేనే సర్దిచెప్పుకొన్నా. డిస్నీవాళ్ల సినిమా ఇది. అంత పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం ఎలా వదులుకో ను? నాన్నగారు కూడా మొదట్లో ఒప్పుకోలేదు. తరవాత ఆయనే ప్రోత్సహించారు. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని విజిల్స్‌ వేశారో. సినిమా పూర్తయ్యాక 'నీ నటనకు నా గులామ్‌..' అన్నారు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలెవరైనా భోజనం చేయకపోతే 'ఐరేంద్రీ వస్తుంది..' అని భయపెడితే గబగబా తినేస్తున్నారట. ఇలాంటివి వింటుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది. మొన్నీమధ్య సుస్మితాసేన్‌ 'అనగనగా ఓ ధీరుడు' డీవీడీ క్యాసెట్‌ అడిగి మరీ తీసుకెళ్లింది అంటూ ఆనందం వ్యక్తం చేసారామె.

  ఇక తన తండ్రి మోహన్ బాబు 550 సినిమాలు చేసినా నంది రాలేదు. తొలి ప్రయత్నంలోనే తాను సాధించిన విషయమై మాట్లాడుతూ...నాన్నగారికి నంది ఇప్పటి వరకూ ఎందుకు రాలేదో నాకిప్పటికీ అర్థం కాదు. ఆయన పోషించిన పాత్రలు మరే నటుడూ చేయలేదు. నంది అవార్డుల ఎంపిక ప్రక్రియే ఆయనకు నచ్చదు. ఈ వ్యవహారాన్ని విమర్శిస్తూనే ఉంటారు. బహుశా.. అందుకే ఆయనకు ఇవ్వడం లేదేమో, 'డాడీ... మనకెందుకు వదిలేయండి' అన్నా వినరు అని అన్నారు. ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న 'గుండెల్లో గోదారి' సినిమా నిర్మిస్తూ నటిస్తున్నారు. మణిరత్నం సినిమా 'కడలి'లోనూ ఆమె ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

  English summary
  
 Having got a Nandi Award for Best Actress in Negative Role category, Lakshmi Manchu is on a cloud nine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X