For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్తతో గొడవపడి పారిపోవడం.. ఆ విషయంలో చీటింగ్ గురయ్యాను.. మంచు లక్ష్మీ

  By Rajababu
  |

  టాలీవుడ్ దిగ్గజం డాక్టర్ మోహన్‌బాబు కూతురు, సినీ నటి మంచు లక్ష్మిది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో అలరిస్తున్న మంచు లక్ష్మీ జన్మదినం అక్టోబర్ 8. ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యాచరణను, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకొన్నారు. మంచు లక్ష్మి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  పుట్టిన రోజును పండుగలా..

  పుట్టిన రోజును పండుగలా..

  మా ఇంట్లో ఎవరి పుట్టినరోజునైనా బాగా బ్రహ్మండంగా చేసుకొంటాం. డాడీ పుట్టిన రోజును కూడా ఓ పండుగలా చేసుకొంటాం. అమెరికాకు వెళ్లిన తర్వాత నేను పుట్టిన రోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకొన్నాను. అక్కడ పుట్టిన రోజు అంటే నలుగురు లేదా ఐదుగురు మాత్రమే హ్యాపీ బర్త్‌డే అంటూ వేడుకను మామూలుగా జరుపుకుంటారు. మన వద్ద అలా ఉండదు. బర్త్‌డేను పండుగల చేసుకొంటారు. స్కూల్‌లో చదువుకునేటప్పుడే నేను బాగా డబ్బు ఖర్చు చేసి స్నేహితులకు పార్టీలు ఇచ్చేదానిని.

  ఎన్నో సమస్యలను, కష్టాలను

  ఎన్నో సమస్యలను, కష్టాలను

  సెలబ్రీటిగా, సినీ నటిగా ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటుంటాను. కానీ అవేమీ బయటకు కనిపించనీయను. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకొంటాను. ఏడాది కాలంలో నేను చేసిన వర్క్, తదుపరి సంవత్సరానికి నా విజన్‌ను పాత్రికేయులతో పంచుకోవాలనుకొన్నాను. పెద్దవాళ్లందరి వద్ద నుంచి దీవెనలు తీసుకోవాలనుకొంటాను.

  ఎలాంటి తీర్మానాలు

  ఎలాంటి తీర్మానాలు

  బర్త్‌డే సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేసుకొను. వచ్చే ఏడాది ఎలా బెటర్‌గా ఉండాలనే ఆలోచనలకు పదనుపెట్టుకొంటాను. సినిమా తారలు అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఎలాంటి తప్పు జరిగినా సినీతారలనే టార్గెట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో నటిగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాను.

  జెమినీ టెలివిజన్‌లో ఫిదా

  జెమినీ టెలివిజన్‌లో ఫిదా

  ప్రస్తుతం జెమినీ టెలివిజన్‌లో ఫిదా అనే షో చేస్తున్నాను. ఎఫ్‌టీవీతో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఆ షో నాకు ఎక్సైటింగ్ అనిపిస్తున్నది. ఆ షో గురించి క్లుప్తంగా చెప్పాలనుకొంటే బేబీస్ డే అవుట్ లాంటింది. ఇంకా క్లియర్ చెప్పాలనుకుంటే వైఫ్‌ డే అవుట్ లాంటిది. భర్తతో గొడవపడి భార్య ఇంటి నుంచి వారం రోజులు వెళ్లిపోతే ఎలా ఉంటుంది. భర్త పడే కష్టం ఏమిటో అనే విషయాన్ని మాడర్న్ డే లైఫ్‌కు తగినట్టుగా ఉంటుంది. అది ఆ వెబ్ సిరీస్ కథ. చాలా అద్భుతమైన కథ. దొంగాట దర్శకత్వం వహించిన వంశీ పీపుల్స్ మీడియా రూపొందించే ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు.

   ప్రతి రోజు గొడవలు

  ప్రతి రోజు గొడవలు

  నిజ జీవితంలో నా భర్త ఆండీకి నాకు ప్రతి రోజు గొడవలు జరుగుతుంటాయి. నా భర్త సాధువు లాంటి వాడు కాబట్టి నన్ను భరిస్తుంటాడు. ఆయనకు నా బిహేవియర్ అలవాటైపోయింది. సాధారణంగా భార్య భర్తల మధ్య కోపతాపాలు రావడం సహజం. భార్యలు ఏమన్నా గానీ భర్తలు పెద్దగా పట్టించుకొరు.

  నేను చీటింగ్ గురయ్యాను

  నేను చీటింగ్ గురయ్యాను

  నా లాస్ట్ సినిమా విషయంలో నేను చీటింగ్ గురయ్యాను. నేను హర్ట్ అయ్యాను. సినిమా నిర్మాతలు వారి సొంత ప్రయోజనాలకు నన్ను వాడుకున్నంత పనిచేశారు. సినిమా బెటర్మెంట్ గురించి వాళ్లు నన్ను యూజ్ చేసుకుంటే నేను ఫీల్ అయ్యే దానిని కాను. చెప్పిన కథ ఒకటి సినిమా తీసింది మరొకటి అని మంచు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.

  English summary
  Manchu Laxmi celebrated her birthday on sunday (October 8th). In this occasion, she speaks her future plans with media. Manchu Laxmi told that she doing Fidaa television show in Gemini Television and she also involved in one web series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X