»   » జెలసీ గురించి రజనీకాంత్ అంకుల్...మంచు లక్ష్మీ ప్రసన్న

జెలసీ గురించి రజనీకాంత్ అంకుల్...మంచు లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య రజనీకాంత్ అంకుల్ వచ్చారు. "మేము ఈ ఇండస్ట్రీలో అన్ని చూశాంరా. ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు..ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసు. అందుకే మీరు ఈ ఫీల్డ్ ‌లో ఉన్నారంటే భయమేస్తుంది. మా మీద ఉన్న జెలసీలు మీ మీద ప్రభావం చూపుతాయేమో అనిపిస్తుంది.." అన్నారు. ఒకవిధంగా అది నిజమే. మేం మోహన్‌ బాబు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాం. కానీ మమల్ని మేమే రుజువు చేసుకోవాలి. లేకపోతే నాన్నగారి పేరుకు మచ్చ వస్తుంది. ఆ టెన్షన్ మాత్రం మాలో ఉంది అంటోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ప్రస్తుతం ఆమె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం చిత్రం నిర్మిస్తోంది. అలాగే రాఘవేంద్రరావు కుమారుడు కె. సూర్య ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఫాంటసీ చిత్రంలో విలన్ గా చేస్తోంది. దీనికి తోడు వచ్చే నెలనుంచి లక్ష్మీ టాక్ షో ని మళ్ళీ ప్రారంభిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu