»   » నాగ్, మనోజ్ మెరిసారు: ‘దొంగాట’ టీజర్ (వీడియో)

నాగ్, మనోజ్ మెరిసారు: ‘దొంగాట’ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగాట' . ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఉగాది సందర్భంగా ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో నాగార్జున, మంచు మనోజ్ మెరిస్తే, బ్రహ్మానందంతో మంచు లక్ష్మి డైలాగు బాగుంది. ఈ టీజర్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దొంగాట సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేసేందుకు నిర్మాత మంచు లక్ష్మి సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం. ఇటీవలే ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు.

Manchu Laxmi's Dongata Teaser

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యతను గుర్తించి రానా ఇందులో నటించడానికి అంగీకరించారని, పాత్ర చిన్నదే అయినా చిత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకే ఆయన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి. మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.

Manchu Laxmi's Dongata Teaser

కథలో తన పాత్రకున్న ప్రాధాన్యతను గుర్తించి రానా ఇందులో నటించడానికి అంగీకరించారని, పాత్ర చిన్నదే అయినా చిత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకే ఆయన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి.

English summary
Manchu Lakshmi is all set to thrill audience with Donagta. Now makers have unveiled the short teaser of the film The main highlight of the short teaser was presence of King Nagarjuna and Manchu Manoj.
Please Wait while comments are loading...