»   » నన్ను చూసి అందరూ తిట్టుకోవాలి: మనోజ్ ఆకాంక్ష

నన్ను చూసి అందరూ తిట్టుకోవాలి: మనోజ్ ఆకాంక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

నన్ను చూసి అందరూ తిట్టుకోవాలి. వీడింతేరా ఇలాంటి తిక్క తిక్క సినిమాలే చేస్తాడు' అనుకున్నా ఫర్వాలేదు. అలా అనుకున్నా నేను విజయం సాధించినట్టే లెక్క అంటున్నారు మంచు మనోజ్. తన లేటెస్ట్ చిత్రం బిందాస్ మంచి టాక్ తెచ్చుకుని ముందుకెళ్థున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ...త్వరలోనే వాణిజ్య విలువలతో ఉన్న ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తా. బిందాస్ చిత్రం ఒక్క విజయంతో నా ప్రణాళికలన్నింటినీ తారుమారు చేసుకోలేను కదా..! నా తొలి చిత్రం 'దొంగ-దొంగది' తర్వాత మాస్‌ సినిమా చేసివుంటే ఈ విజయం ముందే లభించేది. కానీ నేను ఊహించే విజయం వేరే రూపంలో ఉంది. నేను మీకు తెలుసా, ప్రయాణం చిత్రాలు సరిగ్గా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యి ఉంటే బ్లాక్‌ బస్టర్‌ లయ్యేవి అన్నారు.

అలాగే మనం విదేశీ చిత్రాలను సబ్‌టైటిల్స్‌తో మనం చూస్తున్నట్టుగానే, మన తెలుగు చిత్రాలను విదేశాల్లో సబ్‌టైటిల్స్‌తో చూసే స్థాయికి మనం ఎదగాలి. ఎప్పటికైనా నా లక్ష్యం అదే. రికార్డులు, కేంద్రాలు ఇవన్నీ నేను అసలు పట్టించుకోను. జాకీచాన్‌, అమీర్‌ఖాన్‌, కమల్‌హాసన్‌ల్లాగా రకరకాల వైరుధ్యాలతో సినిమాలు చేయాలి.అన్నారు. అలాగే తన వద్ద 'ఊ కొడతారా...ఉలిక్కిపడతారా'. స్క్రిప్టు సిద్ధంగా ఉందని మనోజ్ అన్నారు.దాని గురించి మాట్లాడుతూ.. సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu