»   » మంచు మనోజ్, హీరోయిన్లుగ్రీన్ గణేషా (ఫోటోలు)

మంచు మనోజ్, హీరోయిన్లుగ్రీన్ గణేషా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పోటుగాడు' సినిమా హీరో మంచు మనోజ్, అతని చిత్ర బృందం హైదరాబాద్ ఐమ్యాక్స్‌లో ఏర్పాటు చేసిన 92.7 బిగ్ ఎఫ్.ఎం వారి గ్రీన్ గణేషున్ని దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా ఎకోఫ్రెండ్లీగా జరుపుకోవాలని అభిమానులకు సూచించారు మనోజ్.

గ్రీన్ గణేషుడిని ఏర్పాటు చేయడంపై బిగ్ ఎంఫ్.ఎం బిజినెస్ హెడ్ అశ్విన్ పద్మనాభన్ మాట్లాడుతూ...బిగ్ గ్రీన్ గణేష ప్రచారం యొక్క 6వ విజయవంతపు సంచికను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విజయవంతమైన ప్రచారమని అన్నారు.

ఈ ప్రచారం ప్రజలలో వచ్చిన మార్పుకు ఒక సరికొత్త రిమైండర్ గా వస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడటంపై అవగాహనను వ్యాపింపజేయడమే దీని ముఖ్య లక్ష్యమని, ఈ ప్రచారం ద్వారా అది ప్రతిధ్వనిస్తుందని అన్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

పోటుగాడు సినిమా టీం

పోటుగాడు సినిమా టీం


మంచు మనోజ్, ఆ చిత్ర హీరోయిన్లు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఏర్పాటు చేసిన 92.7 బిగ్ ఎఫ్.ఎం వారి గ్రీన్ గణేషున్ని దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవాలు ఎకోఫ్రెండ్లీగా జరుగాలనే లక్ష్యంతో గ్రీన్ గణేషుడిని ప్రతిష్టించారు.

బిగ్ గ్రీన్ గణేషా

బిగ్ గ్రీన్ గణేషా


భారత దేశంలో విశిష్టమైన వినాయక చవితి పండుగను కాలుష్య రహితంగా, ఆరోగ్యవంతంగా జరిపేందుకు మరియు సామాజిక అవగాహనను కల్పించే దిశగా బిగ్ ఎఫ్ఎం గ్రీన్ గణేషా ప్రచారోత్సవాన్ని 2006లో గణేష చతుర్థి పండగకు ముందు ప్రారంభించారు.

పోటుగాడు

పోటుగాడు


రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు' . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మనోజ్ కెరీర్ లోనే భారీగా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎనిమిమిది వందల థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

శింబు పాట

శింబు పాట


ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 'పోటుగాడు' చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తారు. ‘పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు


సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా గోయెంకా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె. ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

English summary

 Manchu manoj offer's pooja Big fm Green Ganesha at prasad imax. Potugadu movie unit also attended.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu