»   » అక్కయ్య....మంచు లక్ష్మి కోసం మంచు మ‌నోజ్ ఫైట్ (ఫోటోస్)

అక్కయ్య....మంచు లక్ష్మి కోసం మంచు మ‌నోజ్ ఫైట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌. రెండు రోజులు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను మంచు మ‌నోజ్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.

  ఈ సంద‌ర్బంగా....మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నాను. సినిమా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌. సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. రెండు రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైట్స్‌, సాంగ్స్‌ బాగా వచ్చాయి.ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. చాలా బాగా వ‌చ్చింది. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

  చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''మంచు టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. మూడు ఈ నెల 15కంతా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మంచులక్ష్మీగారి, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌ బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌ను మ‌నోజ్‌గారు నేతృత్వంలో చిత్రీరిస్తున్నాం. అడగ్గానే ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయ‌న‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాను దీపావళి ముందే రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

  అక్కయ్య....మంచు లక్ష్మి కోసం మంచు మ‌నోజ్ ఫైట్ (ఫోటోస్)

  అక్కయ్య....మంచు లక్ష్మి కోసం మంచు మ‌నోజ్ ఫైట్ (ఫోటోస్)

  మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌`. రెండు రోజులు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను మంచు మ‌నోజ్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.

  దీపావళి ముందే

  దీపావళి ముందే

  కామెడి, ఎంటర్‌టైన్‌మెంట్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. ఆగస్ట్‌ 15కు పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళికి ముందే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

  నటీనటులు

  నటీనటులు

  పోసాని కృష్ణమురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌, కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

  English summary
  ‘Lakshmi Bomb’ is Manchu Lakshmi Prasanna’s upcoming film in which she features in a title role as Judge. Karthikeya Goplakrishna is directing this film under the presentation of Gunapati Suresh Reddy while Vella Mounika Chandrashekhar, Uma Lakshmi Narasimha are producing it under Udbhav Productions banner.Except for three days, entire film has completed its shooting part. Manchu Manoj who is known for choreographing fights in his own films is designing the climax fight in this film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more