»   » మంచు మనోజ్ ‘S/o పెదరాయుడు’

మంచు మనోజ్ ‘S/o పెదరాయుడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మోహన్ బాబు హీరోగా వచ్చిన 'పెదరాయుడు' చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పకర్లేదు. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ 'S/o పెదరాయుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై నిర్మాత రమేష్ పుప్పాల ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. పి.సాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రం గురించి నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేసి, హాలీవుడ్‌లో 'డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, తెలుగులో 'కిక్' సురేందర్ రెడ్డి దగ్గర పలు చిత్రాలకు పని చేసిన పి.సాగర్‌ని దర్శకుడిగా పరియం చేస్తున్నట్లు తెలిపారు.

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా రూపొందబోయే ఈచిత్రానికి 'S/o పెదరాయుడు' టైటిల్ ఖరారు చేసామని, అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత తెలిపారు. మనోజ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా ఈ సినిమా వైవిద్యంగా ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

English summary
Manchu Manoj new movie 'S/O Pedarayud. This movie is being produced by Ramesh Puppala on Yellow Flowers banner. A new director, P.Sagar, will be handling this film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu