»   » ఒక్కడు మిగిలాడు.. నా చివరి సినిమా.. మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్

ఒక్కడు మిగిలాడు.. నా చివరి సినిమా.. మంచు మనోజ్ షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన మంచు మనోజ్ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. తాను చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నాని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. సినిమాల నుంచి తప్పుకోవాలని తీసుకొన్న నిర్ణయం వెనుక ఏమున్నదనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. నట జీవితం నుంచి వైదొలగాలకోవడం వెనక కారణాలను మనోజ్ వెల్లడిస్తాడా? లేక అభిమానుల ఒత్తిడి మేరకు మనసు మార్చుకొంటారా అనే ప్రశ్నలు ప్రస్తుతం లేస్తున్నాయి.


నా చివరి సినిమా

నా చివరి సినిమా

మంచు మనోజ్ బుధవారం ఉదయమే సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక్కడు మిగిలాడు, ఆ తర్వాత చేసే నా చిత్రం నా చివరి సినిమా అని అన్నారు. నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


షాకింగ్ నిర్ణయంపై..

మనోజ్ నిర్ణయంపై చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పలువురు అభిమానులు సూచిస్తున్నారు. మనోజ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నది. నట జీవితం నుంచి తప్పుకోవడం వెనుక కారణమేంటనే ప్రశ్న అర్థంకాకుండా ఉంది.


బాలనటుడి నుంచి హీరోగా

బాలనటుడి నుంచి హీరోగా

స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మనోజ్ బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత దొంగా దొంగది చిత్రం ద్వారా హీరోగా మారాడు. ఇప్పటివరకు దాదాపు 22 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం గుంటురోడు. ఆయన నటిస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.


పూర్తి స్థాయిలో సినీ నిర్మాణంలోకి..

పూర్తి స్థాయిలో సినీ నిర్మాణంలోకి..

నటజీవితం నుంచి తప్పుకోవడం వెనుక పలు కారణాలను పలువురు విశ్లేషిస్తున్నారు. పూర్తి స్థాయిలో సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే మాట చెప్తున్నారు. ఇలాంటి ఊహాగానాలకు తెరపడాలంటే మంచు మనోజ్ వివరణ ఇవ్వాల్సిందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.English summary
Actor Manchu Manoj taken shocking decision on 14th June. He tweeted that, Okkadu Migiladu and Next movie is the last films as an actor. Thanks u all. Now Manoj's tweet become talk of Industry now. Hope he will give clarity behind his decision to quit acting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu