twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు చేయకపోతే అకౌంట్లు చూపండి.. ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలి.. ‘మా’ వివాదంపై మనోజ్ మంచు

    By Rajababu
    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో జరిగిన నిధుల దుర్వినియోగం వివాదంపై హీరో మంచు మనోజ్ స్పందించాడు. సోమవారం మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ మధ్య జరిగిన మాటల దాడి తీవ్ర వివాదంగా మారింది. నిధుల దుర్వినియోగం జరిగిందని నరేష్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని మంచు మనోజ్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

    మా అసోసియేషన్‌పై ధృడమైన విశ్వాసం ఉంది. తమపై వచ్చిన ఆరోపణలపై ఎవరూ కూడా ఆందోళన చెందడం లేదనుకొంటాను. మనలో ఎలాంటి అపరాధభావం లేకపోతే కమిటీ ముందు నిలుచోవవడానికి ఎలాంటి సందేహం ఉండదు. మా సభ్యుల్లో ఎవరూ కూడా తప్పు చేయలేదని, ముఖం చాటేశారని అనుకోవడం లేదు.

    Manchu Manoj responded over MAA controversy

    మా అసోసియేషన్‌లో చోటుచేసుకొన్న పరిణామాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవతీసుకోవాలి. ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకొని నిజమేంటో చెప్పాలి. వాస్తవం వైపు నిలబడాలని కోరుకొంటున్నాను.

    ఈ అంశంలో 100 శాతం న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. సినీ అమ్మ కుమారుడిగా మర్యాదపూర్వకంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాను.

    నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో మా సభ్యులు తమ అకౌంట్ల పుస్తకాలను కమిటీ ముందు పెడుతుందని ఆశిస్తున్నాను అని మంచు మనోజ్ చివర్లో ఓ పంచ్ ఇచ్చారు.

    English summary
    The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing allegations regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news. In this occassion, Manchu Manoj responded over Naresh comment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X