»   » రూమర్స్ అంటూ కొట్టిపారేసిన మంచు మనోజ్‌

రూమర్స్ అంటూ కొట్టిపారేసిన మంచు మనోజ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు మనోజ్ విలన్ గా చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా చేయనున్న తని ఒరువన్ రీమేక్ లో విలన్ పాత్రకు మంచు మనోజ్ ఆసక్తి చూపించారని, చర్చలు జరుగుతున్నాయని వార్తల సారాంశం. అయితే ఇదే విషయాన్ని ఆయన ముందుకు తీసుకు వెళ్తే... అలాంటిదేమీ లేదని మంచు మనోజ్ కొట్టిపారేశారు.

మంచు మనోజ్ తాజా చిత్రాల విషయానికి వస్తే...

ఇక మనోజ్‌ నుంచి మరోటి..పెళ్లయ్యాక మంచు మనోజ్‌ సినిమాల ఎంపికలో తన జోరు చూపిస్తున్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ 'ఎటాక్‌'తో బిజీగా ఉన్న మనోజ్‌ ఇటీవలే జి.ఈశ్వర్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు దశరథ్‌ సినిమాకీ ఫస్ట్ లుక్ వదిలేసాడు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌, సురభి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎటాక్‌' . సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిల్మ్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని జనవరి 1 వ తేదీ, 2016న విడదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

Manchu Manoj Rubbishes Ramcharan Rumours

మరో ప్రక్క... సంతోషం, మిస్టర్ ఫెరఫెక్ట్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దశరథ్‌ దర్శకత్వంలో మంచు మనోజ్‌, రెజీనాలు జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'శౌర్య'. దశరథ్‌ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని తయారు చేశారని, ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని మనోజ్‌ తెలియజేశారు.

సురక్షా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై ఈ కమర్షియల్‌ ఎంట ర్‌టైనర్‌ను శివకుమార్‌ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాది సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై విడుదలైన 'సూర్య వర్సెస్‌ సూర్య' సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాత శివకుమార్‌ మంచు మనోజ్‌ హీరోగా ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ ''ఈ ఏడాది సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మించి పెద్ద సక్సెస్‌ను సాధించాం. ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ హీరోగా సంతోషం, మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.

English summary
Manchu Manoj was deny the rumours that he'd be part of Ram Charan's next telugu remake of Tamil Superhit Thani Oruvan. Quashing them as 'wrong news'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu