»   » మంచు మనోజ్ 'పోటుగాడు' కథ ఏంటి?

మంచు మనోజ్ 'పోటుగాడు' కథ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా ఎల్వీ రామానాయుడు సమర్పిస్తున్న సినిమా 'పోటుగాడు'. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. పవన్ వడయార్ దర్శకత్వం వహించారు. సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్ మండి, రేచల్ వీస్, అను ప్రియా గోయెంకా నాయికలు. ఈ సినిమాలోని పాటలు ఇటీవల విడుదలయ్యాయి. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

మనోజ్ మాట్లాడుతూ.... అతని పేరు గోవిందు. వింటే.. పేరు పరమ క్లాస్‌గా ఉంది కదూ. కానీ మనిషి చూస్తే మహా మాసు. నోటితో కాకుండా చేత్తో సమాధానం చెబుతుంటాడు. అతన్తో మాట్లాడిన వారికంటే, తన్నులు తిన్నవాళ్లే ఎక్కువ. ఇలాంటి లక్షణాలుంటే ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? కానీ నలుగురు అమ్మాయిలు అతని మాయలో పడిపోయారు. వాళ్లకథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు మంచు మనోజ్‌.

అలాగే ... ''కన్నడలో వడయార్‌ రెండు విజయవంతమైన చిత్రాలు తీశాడు. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా. అచ్చు బాణీలను అందించారు. పాటలు వినగానే అందరికీ నచ్చేస్తున్నాయి. 'ప్యార్‌మే పడిపోయానే..' పాట తప్పకుండా ఆకట్టుకొంటుంది. పాటలెంత బాగున్నాయో సినిమా కూడా అంతే బాగుంటుంది. సినిమాలో కంటెంట్ బావుంది. పాటలు బాగా వచ్చాయి. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు. శ్రీధర్ సీపాన డైలాగులు బావున్నాయి. మా దర్శకుడు రెండు హిట్లతో ఖుషీగా ఉన్నాడు. ఇది మూడో హిట్ అవుతుంది'''అని మనోజ్ చెప్పారు.

''పాటలు ఇంత పెద్ద విజయం కావడానికి మనోజ్ కారణం. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమాకి హీరో , నిర్మాత రెండు కళ్లు. ప్యార్‌మే పడిపోయానే పాట వందల సార్లు విన్నా. అయినా ఇంకా కొత్తగా అనిపిస్తోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు చెప్పారు.

''ఈ సినిమాతో మంచు మనోజ్‌ కూడా కలెక్షన్‌ కింగ్‌ అనిపించుకొంటాడు. ఎన్నో బ్లాక్‌బస్టర్లను ఇచ్చిన మోహన్‌బాబుగారితో ఈ మాటను ధైర్యంగా అంటాను. కన్నడ సినిమా చూసి ఈ కథ మనోజ్‌కి మాత్రమే సరిపోతుంది అనిపించింది. ఈ కథ మిగతా భాషల్లోనూ తీయాలని వుంది. అయితే అక్కడ కూడా మనోజ్‌కి దీటుగా నటించే హీరో కనిపించ డేమో..? మనోజ్‌ ఒప్పుకొంటే మిగతా భాషల్లోనూ మనోజ్‌తోనే తీయాలని వుంది . ఆడియో చాలా బాగా ఉందని సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. మనోజ్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచు వారి నుంచి వచ్చే పంచ్ సినిమా ఇది. వచ్చే వారం విడుదల చేస్తాం''అన్నారు లగడపాటి శ్రీధర్‌. పాటలు ప్రజల్లోకి వెళ్లినందుకు ఆనందంగా ఉందని ఆదిత్య సత్యదేవ్ అన్నారు. మంచి సినిమాలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని అనుప్రియ తెలిపారు.

సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా గోయెంకా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె. ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

English summary
Manchu Manoj starrer Potugadu is likely to release on September 13th. The films music albums were released recently and its post-production work is fast finishing up. So the producer is planning to release the movie in the second week of September. Potugadu is a remake of a Kannada hit movie Govindha Namaha and the Kannada director himself is directing it in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu