»   » జూనియర్ ఎన్టీఆర్‌కు కరెక్ట్ మొగుడు దొరికాడు.. మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్..

జూనియర్ ఎన్టీఆర్‌కు కరెక్ట్ మొగుడు దొరికాడు.. మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్‌కు మంచు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మోహన్‌బాబు అంటే ఎన్టీఆర్‌కు చాలా అభిమానం. అలాగే తారక్ అంటే మంచు విష్ణు మనోజ్‌కు బాగా ఇష్టం. సినిమా సంబంధాలకు అతీతంగా వారి మధ్య రిలేషన్ ఉంది. తాజాగా తారక్ ఇంటికి వెళ్లిన మనోజ్‌కు హృదయాన్ని తాకే ఓ అనుభవం ఎదురైంది. ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోను తాజాగా మనోజ్ ట్వీట్ చేశారు. తారక్‌కు స సరైన మొగుడు దొరికాడు అని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తారక్‌కు మొగుడు ఎవరంటే..

తారక్‌కు మొగుడు ఎవరంటే..

జూనియర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌లో ఎదురులేదు. నటన, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా ఏ రంగంలోనైనా తారక్‌ది ప్రత్యేకమైన శైలి. అలాంటింది ఎన్టీఆర్‌కు తగిన మొగుడు దొరికాడంటే ఎవరా అనే ప్రశ్న మొదలైంది. కానీ ఇంతకీ ఆ మొగుడు ఎవరంటే.. బుజ్జీ ఎన్టీఆరే.

చల్లటి నీళ్ల గ్లాస్‌తో..

చల్లటి నీళ్ల గ్లాస్‌తో..

ఇంతకు అసలు విషమేమింటంటే.. మంచు మనోజ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లాడట. అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ చల్లటి నీళ్ల గ్లాసుతో స్వాగతం పలుకడమే కాదు.. స్వయంగా తానే గ్లాస్‌ పట్టుకొని తాగించాడు కూడా. అంతే బుజ్జీ అభయ్‌ ప్రేమకు పొంగిపోయిన మనోజ్‌.. ఈ బుడ్డోడే తారక్‌కు కరెక్ట్‌ మొగడంటూ ఫొటో పెట్టి మరీ ట్వీట్‌ చేశాడు.

అభయ్ ఆత్మీయ స్వాగతం

జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లగానే అభయ్ నాకు స్వాగతం పలికాడు. గ్లాసులో చల్లటి నీటిని ఇచ్చాడు. అంతేకాకుండా స్వయంగా తాగించాడు. వాడిని చూస్తే ఎన్టీఆర్‌కు కరెక్ట్ మొగుడు అనిపించింది. ఎన్టీఆర్ కంటే 100 రెట్ల ఎనర్జీ వాడిలో కనిపించింది అని అభయ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

తారక్ సమాధానం ఇస్తాడా..

తారక్ సమాధానం ఇస్తాడా..

మంచు మనోజ్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. ఆ ట్వీట్‌ను 1800 మంది రీట్వీట్ చేశారు. సుమారు ఆరు వేల మంది కామెంట్ చేయడం గమనార్హం. అయితే మనోజ్ ట్వీట్‌కు తారక్ ఏలాంటి సమాధానం ఇస్తాడో వేచి చూడాల్సిందే.

English summary
Actor Manchu Manoj visited Junior NTR's home recently. At NTRs home, Manoj gets hearty welcome from master Abhay. He gives him a glass of chilled water. This precious moments shared by manchu manoj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu