»   » 'ప్యార్‌ మే పడిపోయామే...' అంటున్న మంచు మనోజ్

'ప్యార్‌ మే పడిపోయామే...' అంటున్న మంచు మనోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన హీరోలు తమలోని సంగీత ప్రతిభను వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉన్నారు. యంగ్ హీరో మంచు మనోజ్‌ మరోసారి గొంతు సవరించుకొన్నారు. ఆయన గతంలో 'కృష్ణార్జున' చిత్రంలో ఓ పాట పాడారు. మనోజ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'పోటుగాడు'. ఈ చిత్రంలో 'ప్యార్‌ మే పడిపోయామే...' అంటూ సాగే తమాషా గీతాన్ని మనోజ్‌ గానం చేశారు.

తెలుగు, ఉర్దూ, హిందీ పదాలు కలబోసి రాసిన సరదా ప్రేమ గీతమిది. ఈ చిత్రానికి పవన్‌ ఒడెయార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీష, శ్రీధర్‌లు నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో పాటలు విడుదల చేస్తారు.

గురుకిరణ్ స్వరాలందించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ పాటను గానం చేయడం విశేషం. 'ప్యార్‌మే పడిపోయామే' అనే సాహిత్యంతో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో సాగే ఈ పాట ఇప్పటికే యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీంతో పాటు ఈ చిత్రం డైలాగ్ టీజర్ కూడా యూ ట్యూబ్‌లో విశేషాదరణ పొందుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -''కన్నడంలో పాపులర్ అయిన ఓ పాట ఆధారంగా ఈ పాటను రూపొందించాం. ఈ పాటకు, డైలాగ్ టీజర్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి మరో రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు.

అలాగే .. ''మనోజ్‌ పాడిన పాట తప్పకుండా శ్రోతలను అలరిస్తుంది. ఇది కన్నడంలో చాలా ప్రాచుర్యం పొందిన గీతం ఆధారంగా చేసింది. గురుకిరణ్‌ స్వరపరిచారు. ఆ పాట యూట్యూబ్‌లో ఎంతో ఆదరణ పొందింది. దాన్ని ఇక్కడ మనోజ్‌ పాడి, తన తరహా మేనరిజమ్స్‌ జత చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇక రెండు గీతాలు చిత్రించాల్సి ఉంది''అన్నారు.

English summary
Manoj Manchu sing a song "Pyar Mein Padipoya..."...which is entertaining for Potugaadu film. Produced by Lagadapati Sridhar and directed by Pavan Wadeyar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X