»   » ‘’పద్మశ్రీ’’వివాదంపై మంచు మనోజ్ స్ట్రాంగ్ రియాక్షన్

‘’పద్మశ్రీ’’వివాదంపై మంచు మనోజ్ స్ట్రాంగ్ రియాక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మశ్రీని దేనికైనా రెడీ చిత్రంలో వాణిజ్యపరంగా వాడినందుకు హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఈ పద్మశ్రీ అవార్డులను వారం రోజుల్లో వెనక్కి ఇవ్వాలని ఆ సినిమా నిర్మాత మోహన్‌బాబు, హస్యనటుడు బ్రహ్మనందాలకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో మోహన్ బాబు కుమారుడు ,హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో స్ట్రాగ్ రిప్లై ఇచ్చారు.

మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ..."వాడు ఎవడో పనిలేనోడు కేసు వేస్తే దాన్ని మనం లెక్క చెయ్యక్కర్లేదు. గౌరవనీయమైన కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇదంతా దేనికైనా రెడీ వివాదంతో మొదలైంది. అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫిల్మ్ మేకర్స్ మీద రుద్దుతున్నారు. మనకు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి ముందు మా నాన్న, బ్రహ్మీ అంకుల్ ది ఓ సమస్యా? ఆలోచించండి... మీ సపోర్ట్ కు అందరికీ ధాంక్స్." అన్నారు.

Manchu Manoj strong reaction on ‘’Padmashree’’ issue

నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మించిన దేనికైనా రెడీ చిత్రంలో అత్యున్నతమైన సేవలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారాన్ని ఇంటి పేరుగా వాడుకోని దాని విలువను నెైతికంగా దిగజార్చారని, పద్మ పురస్కారాన్ని వాణిజ్య పరంగా వాడుకోవడంపెై ఆవేదన వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రాసేనారెడ్డి గత ఏడాది హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపెై పలు వాదనలు కోర్టుకు వినిపించారు. వాణిజ్య పరంగా పేరుకు ముందు వెనుక పద్మశ్రీ పురస్కారాన్ని వాడుకోవడం కించపరచడమేనని తెలిపారు.

అయితే సోమవారం ఈ పిటిషన్‌పెై హైకోర్టు పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో ఇప్పటికే ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లఘిం చారని హైకోర్టు పేర్కొంది. సెన్సార్‌ బోర్డును కూడా హైకోర్టు మందలించింది. చిత్రాలపెై అభ్యంతరాలుంటే సెన్సార్‌ సభ్యులు గుర్తించాలని తెలిపింది. మొక్కుబడిగా ధృవీకరిం చవద్దని సూచించింది. మోహన్‌బాబుకు 2007, బ్రహ్మనందానికి 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందచేసింది.

పద్మశ్రీ గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వీరిద్దరూ వ్యవహరించారని హైకోర్టు ఆక్షేపించింది. దేనికైనా రెడీ సినిమా టైటిళ్ళలో నిర్మాత పేరును పద్మశ్రీ ఎం.మోహన్‌ బాబు అని, కమెడియన్‌ పేరును పద్మశ్రీ బ్రహ్మానందం అని వేయడంపెై అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి ఈ పిటీషన్‌ దాఖలుచేశారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 18(1) ప్రకారం.. పద్మ పురస్కార గ్రహీతలెవరూ సదరు అవార్డు పేరును ఇలా కమర్షియల్‌ ప్రచారానికి వినియోగించి దుర్వినియోగం చేయకూడదు.

ఇదే అంశాన్ని ప్రస్థావిస్తూ.. మోహన్ ‌బాబు, బ్రహ్మానందలు తప్పుచేశారని కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.వారు స్వచ్ఛందంగా అవా ర్డులను వారంలోగానే స్వయం గా తిరిగి ఇచ్చేయాలని, భారత రాష్టప్రతి కి అందజేయాలని సూచిం చింది. ఈపిటీషన్‌పెై తదుపరి విచార ణను కోర్టు సోమవారానికి వాయిదా వేసిం ది. దేనికైనా రెడీ రిలీజ్‌ తర్వాత సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలున్నాయని అప్పట్లో వివాదం నడిచిన సంగతి తెలిసిందే.

English summary

 Manchu Manoj tweetd, “Vadu yevadoo panilenivodu case vesthe dhanni manam lekha cheyakarledhu. Honourable court dint give the verdict yet. Let it Decide. All this started because of Denikaina Ready controversy. All strict rules are being rubbed on film makers for attention. We have worse problems in our state to deal with… In front of that is my dads and bramhi uncles, a problem? Think.. Love you all and thank u for all the love and support u guys show. Will always work hard and be helpful in some way till last.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu