»   » రెండేళ్ళ తర్వాత హీరోగా: మోహన్ బాబు ఇంకో ప్రయోగం "గాయత్రి"

రెండేళ్ళ తర్వాత హీరోగా: మోహన్ బాబు ఇంకో ప్రయోగం "గాయత్రి"

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో మోహన్ బాబు దాదాపు 2 ఏళ్ల తరువాత తాను నటించే కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. 2015 లో మామ మంచు అల్లుడు కంచు చిత్రంలో మోహన్ బాబు నటించారు. రెండేళ్ల గ్యాప్ తరువాత ఈ సీనియర్ హీరో నటించబోయే చిత్రం నిన్న లాంచ్ అయింది. మహిళలంటే మంచు మోహన్‌బాబుకు ఎంతో మర్యాద. ఆయన మాటల్లో, చేతల్లో మహిళలపై గౌరవం కనిపిస్తూనే ఉంటుంది.

గాయత్రి

గాయత్రి

తాజాగా మరోసారి మహిళలపై ఆయనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించనున్న సినిమాకు ‘గాయత్రి' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘పెళ్లైన కొత్తలో' ఫేమ్‌ మదన్‌ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా శ్రావణ శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది.

Manchu Lakshmi reacts on Digvijay Singh's tweet on Drug Scandal
త్వ‌ర‌లో సెట్స్ పైకి

త్వ‌ర‌లో సెట్స్ పైకి

ఈ రోజు చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు రీసెంట్ గా పూర్తి కాగా, వాటికి సంబంధించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మ‌రి ఈ మూవీని, మ‌ద‌న్ తెర‌కెక్కించ‌నుండ‌గా, న‌టీన‌టులెవ‌రు అనే దానిపై క్లారిటీ రావ‌లసి ఉంది. థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నాడు.

ముహూర్తం షాట్

ముహూర్తం షాట్

గాయత్రి ముహూర్తపు సన్నివేశానికి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా క్లాప్‌ ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు మదన్‌కు అరియానా, వివియానా, మంచు లక్ష్మి, విరోనికా మంచు, నిర్మలా మంచు, పరుచూరి గోపాలకృష్ణ, ‘డైమండ్‌' రత్నబాబు, సుద్దాల అశోక్‌తేజ్‌లు స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు దర్శకుడు.

క‌న్న‌ప్ప

క‌న్న‌ప్ప

ఇక ఇన్నాళ్ళు హీరోగా, విల‌న్ గా, నిర్మాతగా న‌టించిన మోహ‌న్ బాబు మెగా ఫోన్ ప‌ట్టుకునేందుకు కూడా రెడీ అయ్యాడ‌ని తెలుస్తుంది. త‌న‌యుడు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో క‌న్న‌ప్ప అనే చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు రాగా, క‌న్న‌ప్ప‌ పాత్ర‌లో విష్ణుని అద్భుతంగా చూపించేందుకు మోహ‌న్ బాబు మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. విష్ణు క‌న్న‌ప్ప పాత్ర‌లో క‌నిపిస్తే, మోహ‌న్ బాబు శివుడిగా క‌నిపిస్తాడ‌న్న టాక్ వినిపిస్తోంది.

English summary
The film ‘Gayathri’ was launched yesterday on 28th July in a private ceremony. Mohan Babu has confirmed this news by sharing the pics and wrote on the wall of twitter, “#Gayathri "Starting today!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu