For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాన్న ముస్లిం. అమ్మ హిందూ. అందుకే ...: మంచు విష్ణు

  By Srikanya
  |

  హైదరాబాద్ : మంచు విష్ణు తాజా చిత్రం 'దేనికైనా రెడీ'. ఈ బుధవారం ఈ చిత్రం రిలీజవుతోంది. ఈ చిత్రంలో లో మంచు విష్ణు కృష్ణశాస్త్రి, సులేమాన్‌ పాత్రల్లో కనిపిస్తున్నారు. అలాగని ద్విపాత్రాభినయం చేయటం లేదు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయటం లేదు. ఒక్కడే ఇద్దరిలా కనిపిస్తాడు. నాన్న ముస్లిం. అమ్మ హిందూ. అందుకే కాసేపు అలా, కాసేపు ఇలా కనిపిస్తుంటాను. రెండూ అల్లరి పాత్రలే. వినోదానికి ఢోకా ఉండదు. చిత్రాన్ని దర్శకుడు నాగేశ్వరరెడ్డి చక్కగా తీర్చిదిద్దారు అన్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

  అలాగే 'దేనికైనా రెడీ' పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి ప్రత్యేకంగా హోమ్‌వర్క్‌ చేయాల్సిన అవసరం రాలేదని చెప్తూ... ఎందుకంటే... చెన్నైలో ఉన్న నా స్నేహితుల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులే. వారి మాట తీరు, పద్ధతులు నాకు తెలుసు. ఇక హైదరాబాద్‌లో ఉంటున్నాను కదా... హైదరాబాదీ ముస్లింలను రోజూ చూస్తూనే ఉన్నా. కాబట్టి తేలిగ్గానే ఆయా పాత్రల్లోకి వెళ్లిపోయాను అన్నారు.

  తన హిట్ చిత్రం 'ఢీ' గురించి చెప్తూ...ఆ చిత్రానికి ముందు నాలుగు సినిమాలు చేశా. ఆ తరవాత నాలుగు సినిమాలొచ్చాయి. అన్ని సినిమాల్లోనూ నేను డాన్సులు బాగానే చేశాను. నటనాపరంగానూ ఓకే. కాకపోతే 'ఢీ' సినిమాకే నాకు ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే... ఆ సినిమాలో వినోదపు పాళ్లు ఎక్కువగా ఉంటాయి. నాన్నగారి సినిమాలే తీసుకోండి. హీరోగా చేసినా, విలన్‌గా నటించినా వినోదాన్ని వదల్లేదు. 'ఢీ' వరకూ ఆ లైన్‌ నేను మిస్‌ అయ్యాను. నేను కూడా చాలామంది దర్శకుల్ని 'మీ సినిమాలో విలన్‌ పాత్ర ఉంటే చెప్పండి చేస్తా' అని అడిగా. కానీ అందరూ నన్ను హీరోగానే చూస్తున్నారు అన్నారు.

  మంచి సినిమాలు రావాలంటే వైవిధ్యమైన పాత్రలు పుట్టాలి. మూస నుంచి బయటకు రావాల్సిందే. అందుకే... కొత్త పాత్రల కోసం నేను కూడా అన్వేషిస్తున్నాను. బాపుగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో చిన్న పాత్ర అయినా చేయాలని ఉండేది. ఆయన తీసిన గత మూడు సినిమాల నుంచీ 'సార్‌.. మీ సినిమాలో ఏదోక పాత్ర ఇవ్వండి చేస్తా' అని అడుగుతూనే ఉన్నా. ఆఖరికి 'శ్రీరామరాజ్యం' సినిమా కోసం 'కనీసం వేగు పాత్ర అయినా ఇవ్వండి అంకుల్‌ చేస్తా' అని అడిగాను. 'నీతో మరెప్పుడైనా సినిమా తీస్తా. చిన్న చిన్న పాత్రలొద్దు' అనేశారు. 'శ్రీరామరాజ్యం' సినిమా చూసినప్పుడల్లా 'అరె.. ఆ పాత్ర నాకు వచ్చుంటే బాగుండేది. కథను మలుపు తిప్పే పాత్ర' అనుకొంటాను. హీరోయిజం పండించడం కాదు.. మంచి పాత్రలు చేయడమే ముఖ్యం అన్నారు.

  ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

  English summary
  Vishnu Manchu's forthcoming film 'Denikaina Ready' will be relesing on October 24th. Produced by Mohan Babu under his banner 24 Frames Factory, the movie is about to finish all post-production formalities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X