»   » రామ్ చరణ్ లుక్ పై మంచు హీరో ఊహించని కామెంట్

రామ్ చరణ్ లుక్ పై మంచు హీరో ఊహించని కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే...రామ్ చరణ్ సిక్స్ పాక్. సిక్స్ ప్యాక్ అందరూ చేస్తారు కదా అందులో వింతేముందని అంటారా. కానీ రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో ఓ కొత్త రకరమైన లుక్ కనపడుతోంది. ఆయన కష్టం స్పష్టంగా ఆ లుక్ లో కనపడుతోంది. దాంతో ఊహించనివిధంగా రామ్ చరణ్ తాజా చిత్రం 'ధృవ' సినిమా హైలెట్ అవుతోంది.

ఈ శుక్రవారం (డిసెంబర్ 9న) భారీ ఎత్తునవిడుదలవుతోన్న ధృవ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన మేకింగ్ వీడియోలో ధృవ సిక్స్‌ప్యాక్ లుక్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం అందరినీ ఆశ్చర్యపరిచింది. సూపర్బ్ గా ఉన్న సిక్స్ ప్యాక్ లుక్ రావడం కోసం ఆయన పడిన కష్టానికి ఫ్యాన్స్ మాత్రమే కాక, సినీ ప్రముఖులు సైతం హ్యాట్సాఫ్ తెలిపారు. మంచు విష్ణు ఈ సిక్స్ ప్యాక్ గురించి ఏమన్నారో క్రింద చూడండి.

"చరణ్ లుక్ సెక్సీ గా ఉంది. దీన్ని కాకపోతే ఇంక దేన్ని సెక్సీ అంటారో చెప్పలేను. హార్డ్ వర్క్, డెడికేషన్‌తోనే ఇది సాధ్యమవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ధృవ" అంటూ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు మంచు విష్ణు.

ఇక ధృవ సినిమా విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించగా, అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. త‌ని ఒరువ‌న్ పూర్తిగా సీరియ‌స్ మూవీ. దీనికి రీమేక్ గా తెర‌కెక్కిన ధృవ కూడా ఆల్ మోస్ట్ అలాగే ఉండ‌బోతుంద‌ని స‌మాచారం. అయితే ఫ‌స్టాఫ్ లో మాత్రం కామెడీకి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చాడు సురేంద‌ర్ రెడ్డి.

Manchu Vishnu about Ram Charan's Six pack

ర‌కుల్, చ‌ర‌ణ్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు.. చ‌ర‌ణ్, అర‌వింద్ స్వామి మ‌ధ్య వ‌చ్చే సీన్స్.. ఆక‌ట్టుకుంటాయంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక సెకండాఫ్ పూర్తిగా యాక్ష‌న్ కే ప‌రిమిత‌మైన‌ట్లు స‌మాచారం. క్లైమాక్స్ లో చిన్న మార్పులు చేసారని తెలుస్తోంది. మొత్తానికి ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి కావ‌డంతో ప్ర‌శాంతంగా క‌నిపిస్తున్నాడు మెగా వార‌సుడు.

"చరణ్ లుక్ సెక్సీ గా ఉంది. దీన్ని కాకపోతే ఇంక దేన్ని సెక్సీ అంటారో చెప్పలేను. హార్డ్ వర్క్, డెడికేషన్‌తోనే ఇది సాధ్యమవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ధృవ" అంటూ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు మంచు విష్ణు.

English summary
Manchu Vishnu tweeted: "If this isn't sexy, I don't what would be. This is possible only with pure hard work and dedication. Kudos to Charan.All the best to #Dhruva"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu