twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchu Vishnu: 'మా' యాప్.. సొంత డబ్బుతో 'మా' భవనం+ఇళ్ళు.. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్.. మేనిఫెస్టో చూశారా?

    |

    అక్టోబర్ 10న జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ మేనిఫెస్టోలో మా భవనం కోసం ఇప్పటికే మూడు స్థలాలను చూశామని భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా మా భవనం కడతామని పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    MAA App

    MAA App

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు నాయకత్వంలోని స్వచ్ఛమైన తెలుగు ప్యానెల్ను ఆశీర్వదించండి, తద్వారా తెలుగు సిని"మా" ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం అంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా పదిహేను అంశాలను ప్రస్తావించారు.మొదటిది అవకాశాలు,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న కొంతమంది సభ్యులు సినిమాల్లో నటించుటకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, "MAA App" క్రియేట్ చేసి IMDB తరహాలో ప్రతి ఒక్క "మా" సభ్యుల పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తాం.

    "MAA App" యాక్సెసులిటీ నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, మరియు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వుండేలా చేస్తాం అని పేర్కొన్నారు. ఇక 'జాబ్ కమిటీ' ఒకటి ఏర్పాటు చేసి ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

    శాశ్వత నివాస గృహ నిర్మాణం

    శాశ్వత నివాస గృహ నిర్మాణం

    తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా "మా"లో వున్న ప్రతి సభ్యుడికి ఉపయోగపడే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో "మా" సొంత భవన నిర్మాణం చేస్తామని, అర్హులైన "మా" సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. "మా" లో వున్న ప్రతి ఒక్క సభ్యుడికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ సమగ్రమైన ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) అందజేస్తామని, పలు కార్పొరేట్ హాస్పిటల్స్ అనుసంధానమై "మా" కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తామని అన్నారు.

    మూడు నెలలకు ఒకసారి "మా" కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచిత మెడికల్ టెస్టులు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క "మా" సభ్యుడికి ఉచితంగా ESI హెల్త్ కార్డులు అందిస్తామని, ఇప్పటికే 946 మంది "మా" సభ్యులు (అసోసియేట్ మెంబర్ తో సహా) వున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి పేరిట మూడు లక్షల జీవిత భీమా అమలులో ఉంది. దీనిని గణనీయంగా పెంచుతామని అన్నారు.

    వయసుతో సంబంధం లేకుండా

    వయసుతో సంబంధం లేకుండా

    అర్హులైన "మా" సభ్యుల పిల్లలకు KG to PG వరకు విద్యా సాయం చేస్తామని, అర్హులైన "మా" సభ్యులకు "మా" కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సహాయం కొనసాగించబడుతుందని పేర్కొన్నారు. "మా" చరిత్రలో మొట్టమొదటిసారిగా "మా" మహిళా సభ్యుల సంక్షేమం మరియు రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ (including Single Mother and Single Women) ఆర్థిక సహాయం అందజేస్తాం.

    వారికి "మా" ద్వారా సంపూర్ణ భరోసా ఇస్తామని పేర్కొన్నారు. అలాగే తాము గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రస్తుతం పెన్షన్ కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్షన్లు అందేలా చేస్తాం. అలాగే 6, 000/-లు ఉన్న పెన్షన్ ను గణనీయంగా పెంచుతాం. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్షన్ పథకాలు మరియు NBFC లో ఉన్న పథకాలు మన సభ్యులకు కూడా వర్తించేలా చేస్తామని పేర్కొన్నారు.

    "మా" మెంబర్షిప్ తగ్గింపు

    గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్ కు ఓటు హక్కు వచ్చేలా AGM లో ఆమోదం తెచ్చుకుని అమలు చేస్తామని, కరోనా వల్ల కళాకారులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకబడ్డ యువతను ప్రోత్సహించడానికి కొంత కాలపరిమితి వరకు "మా" మెంబర్షిప్ రూ. డెబై ఐదు వేలకి (75, 000/-) తగ్గించి ఇస్తామని పేర్కొన్నారు. ఇక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక Cultural and Finance Committee ని ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి "మా"ని ఆర్థికంగా బలపరుస్తాం. "మా" నటీనటులందరూ కలిసి "మా" ఉత్సవాలు (A Celebration of Telugu Cinema) ఒక పండుగలా జరుపుకుందామని పేర్కొన్నారు.

    మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్

    మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేలా చేస్తామని, "మా" సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి వున్నచో మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 50% స్కాలర్షిప్ శిక్షణ ఇప్పించడమేకాక, పలు పేరొందిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో తగినంత డిస్కౌంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. "మా" ఎన్నికల్లో మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులను కలుసుకుని వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుని మన తెలుగు చలనచిత్ర సమస్యల పరిష్కారానికి, దాని అభివృద్ధి ప్రణాళికలకు వారి సంపూర్ణ సహాయ సహకారాలను అభ్యర్థిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మొత్తం మీద మంచు విష్ణు మేనిఫెస్టో అయితే ఆసక్తికరంగా మారింది. మరి ప్రకాష్ రాజ్ ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూడాలి మరి.

    English summary
    Manchu vishnu announces his panel manifesto here it is. మంచు విష్ణు తన ప్యానెల్ మేనిఫెస్టో ప్రకటించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X