»   » వెరీ క్యూట్: కూతుర్లను ముద్దు చేస్తూ మంచు విష్ణు దంపతులు (ఫోటో)

వెరీ క్యూట్: కూతుర్లను ముద్దు చేస్తూ మంచు విష్ణు దంపతులు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫోటో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మంచు మనోజ్ వివాహం సందర్భంగా తీసిన ఫోటో ఇది. విష్ణు, వెరోనికా దంపతులు తమ ఇద్దరు కూతుర్లను ముద్దు చేస్తున్న దృశ్యం ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉందని ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మంచు విష్ణు కూడా ఇది తన ఫేవరెట్ ఫోటో అంటూ తేల్చేసాడు.

మంచు మనోజ్ వివాహ మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో బుధవారం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంటగ పెద్ద అంగీకారంతో సాంప్రదాయ బద్దంగా దంపతులయ్యారు.

 Manchu Vishnu Family Cutest Pic

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల రాకతో ఈ వేడుక వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబు నాయుడు, సినీ ప్రముఖులు రజనీకాంత్, సుబ్బిరామిరెడ్డి, దాసరి నారాయణరావు, అంబరీష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో పాటు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

English summary
Manchu Vishnu shared the cutest picture from the wedding ceremony of Manchu Manoj on the social networking site Twitter. In this photo, Vishnu was seen kissing his daughter and his wife Viranica on the other hand takes care of their other daughter who is upset for some reason.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu