»   »  ఆ క్షణానికి దేవుడి పేరు "మంచు విష్ణు" .... ఎందుకంటే.... .!!

ఆ క్షణానికి దేవుడి పేరు "మంచు విష్ణు" .... ఎందుకంటే.... .!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

"దేవుడో ఎక్కడో ఉండడు భయ్యా.. మనలోపలే ఉంటాడు.., పక్కవాడికి సాయం చేయాలని నువ్వనుకున్నప్పుడు ఠాప్ మంటూ బయటికొచ్చేస్తాడు." ఒక సినిమా కోసం త్రివిక్రం రాసిన డైలాగ్ ఇది. పక్క మనిషికి సహాయం చేయటమే దైవత్వం అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాలోని మాటని నిజం చేసేందుకు ఇప్పటికి ఎన్నోసార్లు ఎంతో మంది హీరో లు ప్రయత్నించారు... కొన్ని సార్లు ఆ స్థానాన్ని కూడా రీచ్ అయ్యారు.

ఔను..! వాళ్ళు హీరో లే... తెర మీద ఫైట్లూ, పాటలూ పాడి మాత్రమే కాదు బయటకూడా హీరో అనిపించుకుంటారు. ఎలా? అంటే ఒక హీరో చిన్న పిల్లాడి గుండె ఆపరేషన్ కోసం ఆటో నడుపుతాడు, ఇంకో హీరో మూటలు మోస్తాడు, ఇంకో హీరో రోడ్డు పక్కన బండి పెట్టి కూరగాయలమ్ముతాడు, మరో హీరో ఎవ్వరికీ తెలియకుండానే ఒక వృద్దాశ్రమాన్ని నడిపే అమ్మ కి లక్షల రూపాయలని ఇచ్చి తన పేరు చెప్పొద్దంటూ ఆమెని ఇంటికి పంపిస్తాడు....

Manchu Vishnu helps journalist family

ఇప్పుడు మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ గ్రేట్‌ హీరో అనిపించుకున్నాడు. ప‌క్ష‌వాతానికి గురైన ఓ నిరుపేద జ‌ర్న‌లిస్టు జీవితానికి కొత్త ఆశ‌లు చిగురింప‌జేశాడు. జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్‌ హెల్త్ కోసం స‌హాయం చేశాడు. ఆయ‌న పిల్ల‌లను చ‌దివించేందుకు 22 ల‌క్ష‌ల విలువైన ఎడ్యుకేష‌న్ అందించేందుకు ముందుకొచ్చాడు.

ఏడాది కాలంగా ప‌క్ష‌వాతంతో మంచం ప‌ట్టి చావుబ‌తుల‌కుల‌తో పోరాడుతున్న‌ జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్ క‌ష్టాల‌ను చూపుతూ మేముసైతం కార్య‌క్ర‌మం తెర‌పైకి తెచ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో గెస్టు సెల‌బ్రెటీగా పాల్గొన్న మంచు విష్ణు.. బాధిత జ‌ర్న‌లిస్టు క‌ష్టాల‌ను విని క‌దిలిపోయాడు.

Manchu Vishnu helps journalist family

ఒక్క రోజు పానీపూరి అమ్మి త‌న వంతుగా 75,000 రూపాయ‌లు సంపాదించాడు. వాటిని జ‌ర్న‌లిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఆర్థిక స‌హాయం చేస్తూ ఆయ‌న‌ పిల్ల‌లిద్ద‌రికి న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు 22 ల‌క్ష‌ల విలువైన కార్పోరేట్ విద్యను, వారి బాధ్య‌త‌లు చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ భారీ స‌హాయానికి విష్ణుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచువిష్ణుకు జ‌ర్న‌లిస్టులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మంచుల‌క్ష్మి కూడా త‌న‌వంతుగా ల‌క్ష రూపాయ‌ల సహాయం ప్ర‌క‌టించింది. మొత్తం 1 ల‌క్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు. అంటే దాదాపుగా 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ స‌హాయం అందించిన మంచు విష్ణు, మంచు ల‌క్ష్మిల‌కు హ్యాట్సాప్ చెబుతున్నాం. దొంగాట మూవీ డైరెక్ట‌ర్ వంశీకృష్ణ‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెబుతున్నారు జ‌ర్న‌లిస్టులు.

English summary
Vishnu Manchu has anmounced that he, along with Lakshmi, wil be donating 1.75 Lakhs to the family of former journalist Durga Godu. In addition to this, he has also announced that he will be taking care of Durga Goud’s children’s education till their indermediate.This is certainly an unprecedented gesture from Vishnu Manchu and the rest of his family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu