twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ ఒక్కరిది కాదు.. వైఎస్ జగన్, చిరంజీవి భేటిపై మంచు విష్ణు సంచలన కామెంట్స్

    |

    హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల పెంపు గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన చిరంజీవి-జగన్ భేటీ గురించి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వివరాలు...

    తిరుపతిలో స్టూడియో

    తిరుపతిలో స్టూడియో

    సోమవారం నాడు తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే మా అసోసియేషన్‌ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామని అన్నారు. మోహన్‌బాబు తిరుపతిలో స్టూడియో ఏర్పాటు గురించి కూడా త్వరలోనే ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.

    ఏకతాటి పైకి రావాలి

    ఏకతాటి పైకి రావాలి

    ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని, ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టికెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు... ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారు కాబట్టి దీనిపై సినీ పరిశ్రమ ఏకతాటి పైకి రావాలని అన్నాఏకతాటి పైకి రావాలి
    ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని, ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టికెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు... ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారు కాబట్టి దీనిపై సినీ పరిశ్రమ ఏకతాటి పైకి రావాలని అన్నా

    కట్టుబడి ఉంటాం

    కట్టుబడి ఉంటాం

    ఇండస్ట్రీలో నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌.. ఇలా పలు అసోసియేషన్స్‌ ఉన్నాయి. ఆయా అసోసియేషన్స్‌తో మేము చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదన్న ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ సొంతమేనని అన్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. అంతేకానీ, వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదని అన్నారు.

    చర్చ జరగాలి

    చర్చ జరగాలి

    అయితే టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదాము అని పేర్కొన్న ఆయన ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనని విష్ణు పేర్కొన్నారు. ఇక వై.ఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సీఎంగా ఉన్నపుడు దాసరి గారు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు. దీనిపై చర్చ జరగాలి' అని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Recommended Video

    MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
    వ్యక్తిగతం

    వ్యక్తిగతం

    అంతే కాక సీఎం జగన్‌ తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు మంచు విష్ణు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దని ఆయన అన్నారు. సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. నిజానికి గత నెలలో జగన్‌ ఆహ్వానం మేరకు ఆయనని కలిసిన చిరు.. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చించానని మీడియాతో వెల్లడించారు. సినిమా పరిశ్రమ మేలు కోసమే తాను సీఎంతో భేటీ అయ్యానని చిరు అప్పుడు చెప్పుకోచ్చారు. మరి ఇప్పుడు మంచు విష్ణు ఇలా మాట్లాడటం కొత్త అనుమానాలకు తావిస్తోంది అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

    English summary
    Manchu Vishnu made sensational comments that megastar Chiranjeevi's meeting with CM Jagan was personal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X