For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గాలి నాగేశ్వరావు- జిన్నా ఎలా అవుతాడు? తిరుమల కొండల వాడకంతో మరో వివాదం!

  |

  మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అంటే వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. అందుకే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే బలమైన కోరికతో ఉన్నాడు ఆయన. తాజాగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ టైటిల్ ఇప్పుడు వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఆ వివరాలు

  వీడియోలు చేసి

  వీడియోలు చేసి


  మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. హిట్ కోసం చాలా బలంగా ఎదురు చూస్తున్న అయన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. సినిమా ప్రారంభమైన రోజు నుంచే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. సన్నీ లియోన్, పాయల్ లను సినిమాలోకి తీసుకోవడమే కాకా వారితో అప్పుడప్పుడూ కొన్ని వీడియోలు చేసి వదులుతున్నారు కూడా.

  జిన్నా అనే పేరు

  జిన్నా అనే పేరు

  ప్రస్తుతం ఈ గాలి నాగేశ్వర రావు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ లోగో రిలీజ్ చేసింది. అది కూడా మాములుగా లేదండోయ్. అది రివీల్ చేయడం కోసం కూడా ఒక చిన్న ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ చిత్ర టైటిల్ గాలి నాగేశ్వర రావు అంటూ ప్రచారం జరుగుతోంది. విష్ణు కూడా అదే విషయాన్నీ చెబుతూ వచ్చారు. అయితే ఏమనుకున్నారో ఏమో ఇప్పుడు ఆసక్తికరంగా జిన్నా అనే పేరు పెట్టారు.

  మా ప్రెసిడెంట్ కదా

  మా ప్రెసిడెంట్ కదా

  టీమ్ విడుదల చేసిన వీడియోలో విష్ణు ఇంట్లో కూర్చుని సునీల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ మూవీ ఎవరితో అయితే బాగుంటుంది అని సునీల్ ని సలహా అడిగితే నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఢీ, దేనికైనా రెడీ.. ఆ సినిమాలకు కథలు అందించింది కోన వెంకట్. ఆయన్నే అడుగు అని అంటారు సునీల్. దీంతో విష్ణు ఫోన్ చేయగానే కోన వెంకట్ విష్ణు మునుదే ప్రత్యక్షం అవుతారు. ఏం తమ్ముడు ఎందుకు పిలిచావు అని కోన అడుగుతే, సినిమా చేయాలి అంటారు. ఇప్పుడు నువ్వు మా ప్రెసిడెంట్ కదా.. నువ్వు సినిమా చేయడం ఏంటి అని ఫన్నీగా కోన వెంకట్ ప్రశ్నిస్తారు.

   జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా

  జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా

  అదేంటి నేను మా ప్రెసిడెంట్ మాత్రమే ఇండియా ప్రెసిడెంట్ కాదు అంటూ విష్ణు తనపై తానే సెటైర్ వేసుకుని, మా ప్రెసిడెంట్ సినిమాలు చేయకూడదు అని రాజ్యాంగంలో ఉందా అని విష్ణు ప్రశ్నిస్తాడు. దీనిలో కోన కథ చెప్పడం, చోటా కె నాయుడు, దర్శకుడిగా ఇషాన్ సూర్య, సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ని ఎంపిక చేసుకోవడం చకచకా జరిగిపోయినట్టు చూపారు. ఆ తరువాత ఈ సినిమాకి టైటిల్ ఏదైతే బాగుంటుంది అని అడగగా.. కోన వెంకట్ 'జిన్నా' అని సమాధానం ఇస్తారు. విష్ణు వెంటనే జిన్నా ఏంటండీ.. పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా గుర్తుకు వస్తున్నాయి. కాంట్రవర్సీ అవుతుంది అంటే కోన వెంకట్ బదులిస్తూ మనకథలో హీరో పేరు గాలి నాగేశ్వర రావు. అతని పేరు అతనికి నచ్చదు. దీంతో జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా షార్ట్ ఫామ్ లోకి మార్చేస్తాడని అంటాడు.

  దిస్ ఈజ్ టూ మచ్

  దిస్ ఈజ్ టూ మచ్


  అయితే ఇది వాళ్ళు కవర్ చేయడానికి బాగానే ఉన్నా ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదంటున్నారు నెటిజన్లు. గాలి నాగేశ్వరరావుకు షార్ట్ ఫామ్ జిన్నా?! కోన వెంకట్ ఏమిటి దారుణం!? తెలుగులో రాస్తే 'గా.నా' అవుతుంది. ఇంగ్లీష్ లో రాస్తే 'G.N' అవుతుంది. మధ్యలో జిన్నా ఎక్కడ నుండి వచ్చింది? పైగా తిరుమల కొండల వెనుక నుండి సూర్యుడిలా ఆ పేరు పైకి రావడం ఒకటి!? దిస్ ఈజ్ టూ మచ్!! అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో టీమ్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

  English summary
  Manchu Vishnu new movie title Ginna creating new controversies over tirumala hills.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X