»   » మంచు విష్ణు ఓటర్ మిగతా భాషల్లోకి కూడా..!? పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు

మంచు విష్ణు ఓటర్ మిగతా భాషల్లోకి కూడా..!? పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా కాలం గా ఒక మంచి హిట్ కోసం చూస్తున్న మంచు విష్ణు కొత్త సినిమా 'ఆచారి అమెరికా యాత్ర' ను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఏర్పడటం విశేషం. ఇక ఇదే రోజున మంచు విష్ణు నటిస్తోన్న మరో సినిమా టైటిల్ కూడా బయటకు రావడం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ కు తెర తీసినట్లు అయింది. దానికి కారణం ఈ సినిమా పేరు 'ఓటర్' కావడమే.

ఈ మేరకు 'అడ్డా' ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో విష్ణు చేస్తోన్న కొత్త సినిమాకు 'ఓటర్' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇప్పుడు అఫీషియల్ గా ఖరారైపోయింది. అందులోనూ ఈ విషయం తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ద్వారా తెలియడం విశేషంగా నిలిచింది. అసలు విషయంలోకి వెళితే, తాజాగా విద్యానికేతన్ లో మోహన్ బాబు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇళయరాజా మాట్లాడుతూ.. విష్ణు త్వరలో 'ఓటర్' గా పలకరించబోతున్నాడని చెప్పి అందరికీ చిన్న షాక్ ఇచ్చారు.

Manchu Vishnu Next Title Voter is multi lingual?

నిజమెంతో తెలియదుగానీ, ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. కొంతకాలం క్రితం జరిగిన ఒక భారీ స్కామ్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. 'లక్కున్నోడు' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, విష్ణు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది.

Manchu Vishnu Next Title Voter is multi lingual?

పోలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు హిందీ .. ఇంగ్లిష్ భాషల్లోను విడుదల కానుందనేది తాజా సమాచారం. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో వున్నాడు. నిజానికి విష్ణు లో మంచి యాక్టింగ్ స్కిల్ల్స్, కష్టపడే గుణం ఉన్నాయి కానీ సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటికైనా ఒక మాంచి హిట్ పడుతుందేమో అన్న ఆశతో పని చేస్తూ పోతున్నాడు.

సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్ వం: జి.ఎస్.కార్తీక్!!

English summary
As per the latest reliable reports believed that, the young hero Manchu Vishnu next Movie titled as Voter is a Multi lingual
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu