»   » అదంతా నావల్లే జరిగింది.... మిషన్ కంప్లీట్ చేసాను..ఇప్పుడేం చేస్తారు? : మంచు విష్ణు

అదంతా నావల్లే జరిగింది.... మిషన్ కంప్లీట్ చేసాను..ఇప్పుడేం చేస్తారు? : మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రెగ్జిట్‌ ప్రపంచాన్ని ముంచేసింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలనుకున్న బ్రిటన్‌కి మద్దతుగా బ్రిటన్‌ పౌరులు తీర్పునిచ్చారు. నిన్న జరిగిన ఓటింగ్‌ ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. బ్రెగ్జిట్‌కి అనుకూలంగా 52 శాతం ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా 48 శాతం ఓట్లు పోలయ్యాయి. దాంతో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం ఖాయమైపోయింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం బ్రిటన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి నిష్ర్కమణే తమ అభీష్టమని 51.9 శాతంమంది బ్రిటన్ పౌరులు తేల్చిచెప్పారు. ఈయూలోనే కొనసాగాలని భావించినవారు 48.1 శాతం మాత్రమే ఉన్నారని శుక్రవారం వెల్లడైన రెఫరెండం ఫలితాలు తేల్చి చెప్పాయి.

ప్రపంచ ఆర్థిక పరిస్థితిని భారీగా దెబ్బతీస్తున్న ఈ పరిణామంపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ జోక్ వేశాడు. అసలు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవటానికి కారణం తానే అంటూ కామెంట్ చేశాడు విష్ణు.,,'22వ తేదీన లండన్ వచ్చాను.

ఇప్పుడు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది. పౌండ్ విలువ భారీగా పతనం అయ్యింది. నా మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విష్ణు, ఇండియాకు తిరిగి రాగానే తన తదుపరి ప్రాజెక్టుల పై క్లారిటీ ఇవ్వనున్నాడు.

English summary
The whole world is shocked to see that Britain has taken a decision based on referendum to quit from the European Union. While the positives and adversaries are yet to be known about this decision, hero Manchu Vishnu says, it's him who has done that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu