»   » పెద్ద కొడుకు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు!

పెద్ద కొడుకు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో నటుడు మోహన్ బాబుకు ఓ పేరుంది. ఆయన క్రమ శిక్షణకు మారు పేరు, ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ముక్కు సూటిగా చేస్తారు. ఒకరితో మాట పడే పనులు ఆయన చేయరు. తన పిల్లల విషయంలోనూ ఆయన ముక్కుసూటిగానే ఉంటారనే పేరుంది.

తాజాగా మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'లక్కున్నోడు' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ... విష్ణుకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. తన సినిమా ఆడియో వేడుకలో తండ్రి తనకు వార్నింగ్ ఇవ్వడం చూసి విష్ణు కూడా కాస్త షాకయ్యాడు.

మోహన్ బాబు వార్నింగ్ ఇదే

మోహన్ బాబు వార్నింగ్ ఇదే

‘విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్‌ ఏ వార్నింగ్‌. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. ‘నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు. సిన్సియర్‌గా ఉండు' అంటూ మోహన్ బాబు విష్ణుకు సూచించారు.

లక్కున్నోడు

లక్కున్నోడు

విష్ణు మంచు హన్సిక జంట‌గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `ల‌క్కున్నోడు`. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన డా.మంచు మోహ‌న్‌బాబు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు.

నిర్మాత గురించి మోహన్ బాబు

నిర్మాత గురించి మోహన్ బాబు

మంచు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ - ``స‌త్య‌నారాయ‌ణ‌గారు మంచి నిర్మాత‌, చెప్పింది చెప్పిన‌ట్టు చేసుకుంటూ వ‌చ్చాడు. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. నాకు విల‌న్ పాత్ర అంటేనే ఇష్టం. అలాంటి ఒక మంచి విల‌న్ పాత్ర‌ను స‌త్య‌నారాయ‌ణ‌గారు చ‌క్క‌గా చేశారు. నా నెక్ట్స్ సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌గారికి మెయిన్ విల‌న్ పాత్ర‌ను ఇస్తున్నాను అని తెలిపారు.

నా బిడ్డలకు అదే నార్పాను

నా బిడ్డలకు అదే నార్పాను

నేను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జీవించాను. ఏ రోజు సెట్‌కు టైం అంటే ప‌ది నిమిషాల ముందుగానే ఉండేవాడిని. ఈ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఎన్టీఆర్‌గారు, నా గురువుగారు దాస‌రిగారు నేర్పించారు. అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నా బిడ్డ‌ల‌కు నేర్పించాను. క‌ష్ట‌ప‌డ‌టం నేర్పించాను అని మోహన్ బాబు తెలిపారు.

సినిమా గురించి

సినిమా గురించి

ల‌క్కున్నోడు సినిమా అత్య‌ధ్భుత‌మైన సినిమా. నేను ఢీ సినిమా చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో అలా ఫీల‌యిన సినిమా ఇది. అనేక ట్విస్టుల ఉన్న సినిమా. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి మంచి సినిమా చూడ‌లేదు. కామెడి చేయ‌డం అంత సులువు కాదు. విష్ణు ఈ సినిమాలో చాలా చ‌క్క‌టి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. విష్ణుకైతేనే ఈ క‌థ‌ను ఇస్తాన‌ని డైమండ్ ర‌త్న‌బాబు, మంచి క‌థ ఉన్న ల‌క్కున్నోడు చిత్రాన్ని ఇచ్చిన ర‌త్న‌బాబుకు థాంక్స్‌. మంచి డైలాగ్స్ రాశాడు. ఫిభ్ర‌వ‌రి 3న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని మోహన్ బాబు తెలిపారు.

 నేను ల‌క్కున్నోడుగానే భావిస్తున్నాను

నేను ల‌క్కున్నోడుగానే భావిస్తున్నాను

విష్ణు మంచు మాట్లాడుతూ ...నాకు ఈ స్క్రిప్ట్‌ను డైమండ్ ర‌త్న‌బాబు ఇవ్వ‌డం, ఇంత మంచి న‌టీన‌టుల‌తో ప‌నిచేయ‌డం, నా త‌ల్లిదండ్రుల‌ను చూసి, ప‌ది కోట్ల మందిలో ఇర‌వై, ముప్పై మంది హీరోలుంటే వారిలో నేను ఒక‌డైనందుకు, ఇంత మంచి అభిమానులున్నందుకు నేను ల‌క్కున్నోడుగానే భావిస్తున్నాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

ఆస్థులు పోవ‌డంతో మా నాన్న‌గారు న‌న్ను దుర‌దృష్ట‌వంతుడిగా భావించారు

ఆస్థులు పోవ‌డంతో మా నాన్న‌గారు న‌న్ను దుర‌దృష్ట‌వంతుడిగా భావించారు

రాజ్‌కిర‌ణ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోష‌న్ ఉంది. నా లైఫ్‌లో జ‌రిగిన సిచ్చువేష‌న్‌తోనే ఈ క‌థ రాసుకున్నాను. నేను పుట్ట‌గానే ఆస్థులు పోవ‌డంతో మా నాన్న‌గారు న‌న్ను దుర‌దృష్ట‌వంతుడిగా భావించారు. ఆయ‌న పోగొట్టుకున్న ఆస్థుల‌ను మ‌ళ్లీ సంపాదించాల‌నుకున్నాను. నేను డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత మా నాన్న‌గారు నా ద‌గ్గ‌ర లేరు. ఆ ఎమోష‌న్‌తోనే ఈ సినిమా చేశాను. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది`` అన్నారు.

ఫిబ్రవరి 3న విడుదల

ఫిబ్రవరి 3న విడుదల

చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ -64 డేస్‌లోనే సినిమాను పూర్తి చేశారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఇందులో విష్ణు త‌న‌దైన ల‌వ్‌, కామెడితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. డైమంగ్ ర‌త్న‌బాబు, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, అచ్చు సంగీతం సినిమా పెద్ద ప్ల‌స్ అవుతాయి. మంచి టీంతో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 3న సినిమా రిలీజ్ అవుతుంది`` అన్నారు.

నటీనటులు

నటీనటులు

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్.

English summary
Telugu Movie Luckunnodu Audio Launch event held at Hyderabad. Manchu Vishnu, Mohan Babu and others graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu