»   »  సిక్స్ ప్యాక్ తో 'సరదా' పడ్డాడు (ఫస్ట్ లుక్)

సిక్స్ ప్యాక్ తో 'సరదా' పడ్డాడు (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం 'సరదా'. ‘అడ్డా' ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ ప‌ల్లి కేశ‌వరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జాదూగాడు' ఫేమ్ సోనారిక ఒక హీరోయిన్ గా చేస్తోందిది.

ఈ సినిమాలో విష్ణు కొత్త లుక్‌లో, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. దీని కోసం అమెరికా నుంచి ట్రైనర్‌ను రప్పించి సిక్స్ ప్యాక్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా 'సరదా'గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ ఫొటోలు ఇక్కడ చూడండి.


Manchu Vishnu 's Sarada First Look released

దర్శకుడు మాట్లాడుతూ ''కథలోని పాత్ర ప్రకారమే ఈ సినిమాలో విష్ణు లుక్‌ ఉండబోతోంది. విష్ణు సిక్స్‌ప్యాక్‌ కోసం అమెరికా నుంచి ట్రైనర్‌ని తీసుకొచ్చాం. పేరుకు తగినట్టే మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ సరదాగా సాగిపోయే ప్రేమకథ ఇద''అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ..''ఇటీవల తొలి షెడ్యూలు పూర్తయింది. త్వరలో మలిదశ చిత్రీకరణ మొదలెడతామ''న్నారు నిర్మాత. అలాగే.. ‘సరదా' అనే టైటిల్ ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉందో సినిమాలో అంతకంటే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టే ‘సరదా'లో దర్శకుడు కార్తీక్ రెడ్డిగారు మంచు విష్ణుని కొత్తగా చూపిస్తున్నారు. మంచు విష్ణుగారు ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశారు.కథతో పాటు కామెడి కలిసి ఉండి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది" అన్నారు.


Manchu Vishnu 's Sarada First Look released

బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్‌ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌: యస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఫైట్స్‌: విజయ్‌, పి.ఆర్‌.ఓ: వంశీ-శేఖర్‌,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్‌, నిర్మాతలు: సోమా విజయ్ ప్రకాష్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్‌ రెడ్డి.

English summary
Manchu Vishnu’s new movie titled “Sarada” first look revealed today on the eve of Vishnu’s birthday.
Please Wait while comments are loading...