»   » తిరుపతిలో దూసుకెళ్తున్న మంచు విష్ణు

తిరుపతిలో దూసుకెళ్తున్న మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu
తిరుపతి : మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'దూసుకెళ్తా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'అందాల రాక్షసి' ఫేమ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్. మోహన్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

తిరుపతిలోని పద్మావతి దేవస్థానం సమీపంలో సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, తిరుపతికి షిఫ్ట్ అయిన యూనిట్ మొదట విష్ణు పరిచయ గీతాన్ని ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో తీశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

పూర్తి స్ధాయి యాక్షన్ తో ఫన్ కలిపి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు చెప్తున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మంచు విష్ణు గత చిత్రం దేనికైనా రెడి హిట్టైన నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ బాగా జరుగుతుందని సమాచారం.

అలాగే 'అందాల రాక్షసి' ఫేమ్ లావణ్య హీరోయిన్ గా చేస్తుండటంపై మంచి అంచనాలే ఈ చిత్రంపై ఉన్నాయి. బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల రచన, దర్సకత్వం చేస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్, రావు రమేశ్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులు.

English summary
Manchu Vishnu is now doing his next film Doosukeltha in Veeru Potla's direction. Veeru Potla is writing for this film, to be produced by Vishnu himself on his banner 24 Frames Factory, to be presented by Mohan Babu. Lavanya Tripathi of 'Andala Rakshasi' is the female lead. The movie is shooting a song in Prem Rakshit's choreography and some key scenes at Tirupathi near Padmavathi Temple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu