twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jaganతో మీటింగ్.. నాన్నకు ఆహ్వానం పంపినా.. ఇవ్వలేదు: విష్ణు షాకింగ్ కామెంట్స్

    |

    సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలతో ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ అలాగే రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి మరికొందరు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మీటింగ్ అనంతరం విష్ణు ఇటీవల మెగాస్టార్ అలాగే ఇతర హీరోలు జరిపిన మీటింగ్ పై కూడా ఎవరు ఉహించని విధంగా రియాక్ట్ అయ్యారు.. ఆ వివరాల్లోకి వెళితే..

    జగన్ తో విష్ణు..

    జగన్ తో విష్ణు..

    విజయవాడలో మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇదివరకే రెండుసార్లు విష్ణు జగన్ ను కలిశారు. లంచ్ కూడా చేసినట్లు చెప్పారు. మోహన్ బాబు గత ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మంచు విష్ణు కుటుంబ సమేతంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని చాలా సందర్భాల్లో మద్దతు ఇచ్చారు.

    మంచు విష్ణు అప్సెట్

    మంచు విష్ణు అప్సెట్


    అయితే మా ఎన్నికల్లో గెలిచిన అనంతరం మంచు విష్ణు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో కలుసుకున్నారు. వీరు హఠాత్తుగా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా మంచు విష్ణు ఇంటికి వచ్చి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడగానే విష్ణు తప్పుడు వార్తలపై అప్సెట్ అయ్యాడు.

    జగన్ బావ అవుతారు

    జగన్ బావ అవుతారు

    ఇక సీఎం జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అనంతరం మంచు విష్ణు స్పందించారు. తాను సీఎం జగన్ ను కలవడం ఇది మూడో సారి అంటూ నాకు వరుసకు ఆయన బావ అవుతారని కూడా విష్ణు తెలియజేశాడు. ఇక ఆ బంధుత్వం ఉన్నప్పటికీ జగన్ గారిని తాను అన్న అని పిలుస్తాను అని విష్ణు వివరణ ఇచ్చారు.

    పర్సనల్ విజిట్..

    పర్సనల్ విజిట్..


    ఇక నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న విషయంలో ఎలాంటి రాజకీయం లేదని పూర్తిగా పర్సనల్ విజిట్ అని అన్నారు. ఇక నేను తిరుపతిలో కూడా స్టూడియోలు కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు కావాలి. మాకు తెలంగాణ,ఆంధ్రా రెండు కళ్లు లాంటివి అని విష్ణు అన్నారు.
    అలాగే విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తాం అని అన్నారు.

    అలా ఎవరు చేశారో తెలుసు

    అలా ఎవరు చేశారో తెలుసు

    ఇక ఇటీవల కొంతమంది స్టార్ హీరోలు దర్శకులు ప్రత్యేకంగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చర్చించడంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు.
    మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని అంటూ నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చినప్పటికి కూడా ఆయనకు అందజేయలేదని అన్నారు. ఇక నాన్న గారికి ఇన్విటేషన్ అందకపోవడం పై కూడా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం అంటూ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ నాన్న గారు అని అన్నారు. ఇక అలా ఎవరు ఇలా చేశారో మాకు తెలుసని అంటూ ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తామని విష్ణు అన్నారు.

    Recommended Video

    MAA Elections: Prakash Raj VS Manchu Vishnu మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..
     చిత్తుచిత్తూగా ఓడించాను..

    చిత్తుచిత్తూగా ఓడించాను..


    ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం.. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. అవన్నీ పరిష్కరించుకుంటామని విష్ణు తెలిపారు. పేర్ని నాని తో సమావేశం పై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసిందని అయితే నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారని టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారని విష్ణు అన్నారు. పేర్ని నాని మా ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారు అంటూ మాకు సపోర్ట్ లేకపోతే మా ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తానని అందరినీ చిత్తు చిత్తుగా ఓడించానని విష్ణు వివరణ ఇచ్చారు.

    English summary
    Manchu vishnu shocking reaction after ys jagan personal meeting,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X