»   » మంచు విష్ణు వర్ధన్ కొత్త చిత్రం ప్రారంభం

మంచు విష్ణు వర్ధన్ కొత్త చిత్రం ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

విష్ణు హీరోగా బాలీవుడ్ దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ డైరక్షన్ లో ఓ చిత్రం రూపొందబోతోంది. విష్ణు తండ్రి మోహన్‌ బాబు నిర్మాతగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మోహన్‌బాబు క్లాప్‌ నివ్వగా, మంచు నిర్మలాదేవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శ్రీనువైట్ల, హీరో కల్యాణ్‌రామ్‌లు దర్శకుడికి స్క్రిప్టు అందించారు. సంగీతం...మణిశర్మ, కెమెరా...ఎస్‌.గోపాల్ ‌రెడ్డి, కూర్పు...గౌతంరాజు. మిగతా సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక హేమంత్ మధుకర్ గతంలో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే హేమంత్ తెలుగువాడే కావటం విశేషం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హేమంత్ హిందీలో తొలి చిత్రాన్ని చేసారు. ఇక విష్ణు డిజాస్టర్ అయిన సలీం చిత్రం అనంతరం చేస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu