»   » నా భార్యను లైట్ తీస్కోండి: సుహాసిని వ్యాఖ్యలపై మణిరత్నం

నా భార్యను లైట్ తీస్కోండి: సుహాసిని వ్యాఖ్యలపై మణిరత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' సినిమా రేపు(ఏప్రిల్ 17) గ్రాండ్ గా విడుదలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో ఆడియో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అంతకు ముందు ఓ ప్రెస్ మీట్లో సుహాసిని ఈ సినిమా గురించి మాట్లాడుతూ....క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే ‘ఓకే బంగారం' రివ్యూ రాయాలి అంటూ కామెంట్ చేసారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు సినిమాలపై తమ తమ రివ్యూలు రాస్తున్న నేపథ్యంలో సుహాసిని ఈ వ్యాఖ్యలు చేసారు.

ఈ నేపథ్యంలో...సుహాసిని వ్యాఖ్యలపై ఆడియో సక్సెస్ మీట్లో మణిరత్నంపై ప్రశ్నల వర్షం కురిపించారు పాత్రికేయులు. దీనికి ఆయన స్పందిస్తూ... ‘సోషల్ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు. వాళ్లని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. సుహాసిని మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ బావుంటే అందరికీ నచ్చుతుంది' అని చెప్పుకొచ్చారు.

Mani Ratnam Clarifies Suhasini's Comments

మణిరత్నం దర్శకత్వంలో నిత్యమేనన్‌, సల్మాన్‌ దుల్కర్‌ జంటగా నటించిన చిత్రం 'ఓకే బంగారం'. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆడియో సక్సెస్‌మీట్‌ను హైద్రాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు రెహమాన్‌, హీరో నాని, హీరోయిన్‌ నిత్య మేనన్‌, నటుడు ప్రకాష్‌ రాజ్‌, నిర్మాత దిల్‌రాజ్‌ హాజరై మాట్లాడారు.

English summary
While OK Bangaram is gearing up for a release tomorrow, the team was in Hyderabad, yesterday, to celebrate the audio success. Media personnel, who were present at the event, did not leave Mani Ratnam without questioning about Suhasini's harsh comments.
Please Wait while comments are loading...