»   » మణిరత్నం నెక్ట్స్ మూవీ ప్రకటించాడు

మణిరత్నం నెక్ట్స్ మూవీ ప్రకటించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తర్వాతి సినిమాను ప్రకటించాడు. కార్తి, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సంవత్సరాంతంలో ఆ సినిమా ప్రారంభం కానుంది. 90 రోజుల్లో షూటింగ్ కంప్టీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు మణిరత్నం ప్రకటించారు.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం ‘కోమలి' పేరుతో ఈ ప్రాజెక్టును పిలస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. సినిమాలో కార్తి, దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు.

Mani Ratnam next with Karthi and Dulquer Salmaan

మణిరత్నం సినిమాలంటేనే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఆయన జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ముంబాయి, రోజా లాంటి చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే ఆయన సినిమాలు ఎప్పుడొస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అభిమానులు.

కెరీర్లో ఎన్నో విజయవంతమైన భారీ సినిమాలు తీసిన మణిరత్నం ఆ మధ్య వరుస ప్లాపులు సైతం చవి చూసారు. అయితే ప్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమాలకు ఓపెనింగ్స్ వస్తుంటాయి. దర్శకులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఓకే బంగారం' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

English summary
Veteran filmmaker Mani Ratnam has made a formal announcement that his next project will go on floors by the end of this year. Tentatively titled Komali, it will feature youngsters Karthi and Dulquer Salmaan in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu