twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమించే పెళ్లి చేసుకున్నాం : మణిరత్నం

    By Srikanya
    |

    హైదరాబాద్ :హాసిని (సుహాసిని), నేనూ ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. మాకు ఒక అబ్బాయి. హాసినికి నటనలోనేకాదు... కథ, సంభాషణలు రాయడంలోనూ ఆసక్తి ఉండేది. రోజా సినిమా నుంచీ నా ప్రతి సినిమాలోనూ తను కొన్ని సీన్లూ, సంభాషణలూ రాయడం మొదలుపెట్టింది అంటూ మణిరత్నం తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

    అలాగే రోజాలో ఇంటర్వెల్‌ తరవాతి సగం సీన్లు తను రాస్తే, మిగతా సగం నేను రాశాను. చాలా సందర్భాల్లో మేమిద్దరమూ కలిసే పనిచేస్తాం. కొన్నిసార్లు విడివిడిగా సీన్లు రాసుకుంటాం. ఇద్దరమూ ఓచోట కూర్చుని వాటిని కలిపేస్తాం. ఎమోషనల్‌ సీన్లు రాసేటప్పుడు హాసిని సాయం తప్పకుండా తీసుకుంటా అన్నారు మణి.

    ఇక 'రోజా'లో చిత్రం గురించి చెప్తూ.. నా ఆరాధ్య దర్శకుడు బాలచందర్‌ ఓసారి తన బ్యానర్లో ఓ సినిమా చేయమన్నారు. ఆయనకోసం తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంతో కథ రాసుకున్నాను. అదే 'రోజా'. ఇందులో ఇళయరాజాను కాకుండా... మొదటిసారి ఏఆర్‌ రహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాను. రహమాన్‌ నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. తనకి తాను సొంత ఇమేజ్‌ని సృష్టించుకున్నాడు. అలా రహమాన్‌తో నా ప్రయాణం మొదలైంది. ఆ తరవాత బొంబాయి, ఇద్దరు, దిల్‌సే, సఖి, అమృత, యువ, గురు, రావణ్‌, ఇటీవల కడలి చేశాను అన్నారు.

    అలాగే నా సినిమాలకు సెన్సార్‌బోర్డు సమస్యలు మొదట్నుంచీ ఉన్నాయి. 'మౌనరాగం'కి సెన్సార్‌వాళ్లు 'ఎ' సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. అందుకు కారణం... అందులోని ఓ అమ్మాయి విడాకులు అడుగుతుంది. బోంబే సినిమా విడుదలకు ఎన్ని ఇబ్బందులో! కొన్ని సందర్భాల్లో సెన్సార్‌బోర్డువాళ్లు నాకు కనిపించలేదు. వాళ్లకు బదులు మంత్రిగారు, సెక్రెటరీ, వాళ్ల కుటుంబ సభ్యులూ కూర్చుని నా సినిమా గురించి తీర్పులివ్వడం మొదలుపెట్టారు.

    ఓ పోలీసాఫీసరైతే 'నీ సినిమా తెరమీద పడదు' అన్నారు. నిజానికి ఇది తమిళ సినిమా అయినా ముంబై కథతో ముడిపడి ఉన్నందున మహారాష్ట్రలో ఎన్నికలయ్యేవరకూ సినిమా విడుదలకానివ్వలేదు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలని చేశానే తప్ప... ప్రయోగాల కోసం కాదు. నేను విజయాలకు పొంగిపోను. పరాజయాలకు కుంగిపోను. ఏ ఫిలాసఫీ లేకపోవడమే నా ఫిలాసఫీ అని తన జీవితం గురించి చెప్పుకొచ్చారు.

    English summary
    Mani Ratnam says that he is fell in love with Suhasini and after they married. He says that Suhasini is the Co-writer for Roja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X