»   » ‘మణి ఈజ్ బ్యాక్’ ...(‘ఓకే బంగారం’ ప్రివ్యూ)

‘మణి ఈజ్ బ్యాక్’ ...(‘ఓకే బంగారం’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ముఖ్యంగా రావణ్, కడలి వంటి ఫెయిల్యూర్ చిత్రాలు తర్వాత వస్తున్న చిత్రం కావటం...ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పోస్టర్స్, ఆడియో మళ్లీ సఖి చిత్రం రేంజిలో ఆసక్తి రేపుతూండటంతో అందరిలోనూ చూడాలనే ఉత్సుకత రేగుతోంది. అందిరోనూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్' అనే ఆలోచనే ఉంది. అది ఎంతవరకూ మణిరత్నం నిలబెట్టుకున్నారనేది ఈ రోజు తేలనుంది.


Mani Ratnam's OK Bangaram preview

వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లే ముందు ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ముంబయిలోని ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చోటు చేసుకొన్న పరిణామాలు ఎలాంటివన్నది తెరపైనే చూడాలి.


నిర్మాత దిల్‌లాజు మాట్లాడుతూ ..ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన పాటలు మంచి విజయాన్ని సాధించాయని, ఇప్పటివరకూ వచ్చిన ప్రోమోస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని అన్నారు. మణిరత్నం సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంటుందని, అప్పట్లో వచ్చిన సఖి చిత్రం తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అన్నారు. లివింగ్ రిలేషన్ మీద ఇప్పటివరకూ బాలీవుడ్‌లోనే సినిమాలు వచ్చాయని, ఇప్పుడు మొదటిసారిగా తెలుగులో రూపొందుతున్న అలాంటి సినిమా ఇదని చెప్పారు. పి.సి.శ్రీరామ్ అద్భుతమైన కెమెరా పనితనం, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు.


Mani Ratnam's OK Bangaram preview

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు


నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌.


బ్యానర్: మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సినిమా : ఓకే బంగారం
నటీనటులు:దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్,ప్రభు లక్ష్మన్, రమ్య సుబ్రమణ్యన్, కనిక, బివి దోషి తదితరులు
ఛాయాగ్రహణం: పిసి శ్రీరామ్
పాటలు: సీతారామ శాస్త్రి
సంగీతం: ఎఆర్.రహమాన్
నిర్మాత: దిల్‌రాజు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
సెన్సార్ సర్టిఫికేట్: యు/ఏ


విడుదల తేదీ 17,ఏప్రియల్ 2015.

English summary
The most-awaited Mani Ratnam movie "OK Bangaram" starring Dulquer Salmaan and Nithya Menen in the lead will hit the screens on 17 April. The movie is touted to be an urban romantic flick and the director has confirmed that it will stand in resonance with the present generation of urban India.
Please Wait while comments are loading...