»   » తెర వెనుక ఏం జరిగింది? మణిశర్మ బ్రహ్మోత్సవం నుండి ఎందుకు తప్పుకున్నాడు ??

తెర వెనుక ఏం జరిగింది? మణిశర్మ బ్రహ్మోత్సవం నుండి ఎందుకు తప్పుకున్నాడు ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిశర్మ ఇంతకు ముందు మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తెరకెక్కిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాకు బ్యాక్ గ్రౌండ్ ను అందించి, ఆ సినిమా సక్సెస్ లో తాను కూడా ఒక పాత్ర పోషించాడు. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా అతడి చాలా సినిమాలకు సంగీతాన్ని అందించాడు మణిశర్మ.

బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా మణిశర్మకు తిరుగులేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఇంద్ర, ఠాగూర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, స్టాలిన్ లాంటి సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్లు నేటికీ సెన్సేషనల్ గానే అనిపిస్తాయి

"బ్రహ్మోత్సవం" సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంలాంటిదని భావించిన మహేశ్ బాబు, మణిశర్మ అయితేనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలకు చెప్పాడట. వాళ్ల కోరిక మేరకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందించడానికి మణిశర్మ అంగీకరించాడట.

Mani Sharma Out From Brahmotsavam Movie

అయితే ఏం జరిగిందో ఏమో ఈ ప్రాజెక్టునుంచి లాస్ట్ మినిట్ లో మణిశర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది.మణిశర్మకు నిర్మాతతో సమస్య లేక దర్శకుడుతోనా అనేది తెలియరాలేదు. మరి విడుదల తేదీ దగ్గరపడుతుండగా, ఇప్పుడు మణిశర్మ ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ కావడానికి రీజన్ ఏంటో...? బ్రహ్మోత్సవం టీమ్ కే తెలియాలి. ఆయన స్దానంలో మళయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ వచ్చినట్లు చెప్తున్నారు. గోపీసుందర్ తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను చేయిస్తున్నారు.

ఇటీవల తెలుగులో అనూహ్యమైన విజయాన్ని సాధించిన "ఊపిరి" సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది కూడా. అయితే ఈ ప్రాజెక్టు నుంచి మణిశర్మ ఎందుకు తప్పుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని గురించే ఫిల్మ్ నగర్లో చర్చలు నడుస్తున్నాయి.

ఓవైపు డబ్బింగ్.. మరోవైపు రీరికార్డింగ్.. ఇంకోవైపు మిక్సింగ్.. ఇలా విడుదల తేదీని అందుకోవడానికి బాగానే శ్రమిస్తోంది "బ్రహ్మోత్సవం" టీమ్. ఈ నెల 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి.

English summary
composer Mani Sharma who was roped into score background music for Brahmotsavam is opted out of the Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu