»   » 2017 మణిశర్మ దే... మళ్ళీ బిజీ అయిన మెలొడీ బ్రహ్మ

2017 మణిశర్మ దే... మళ్ళీ బిజీ అయిన మెలొడీ బ్రహ్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిశర్మ సంగీత దర్శకుడుగా ఉంటే చాలు. సినిమా పాటలు హిట్‌ అవుతాయని చిన్న నిర్మాతల అభిప్రాయం.. ఆయన ఒకప్పుడు అగ్రహీరోల చిత్రాలకే సినిమాలు చేసేవాడు. రానురాను యూత్‌ టాలెంట్‌ రావడంతో ఆయన షోలు నిర్వహిస్తూ అవకాశం ఉన్నప్పుడు చిన్నపాటి చిత్రాలతో అలరిస్తున్నాడు. అయితే మళ్ళీ మణి తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నాడు... ఈ సంవత్సరం ఈ మెలొడీ కింగ్ తన ప్రతాపాన్ని చూపించనున్నాడు...

జెంటిల్ మేన్

జెంటిల్ మేన్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మేన్' సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు.ఆ సినిమా ఘన విజయాన్ని అందించడంతో అటు దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్ కి పేరు రావడంతో ఇంద్రగంటి మోహనకృష్ణ తన తదుపరి సినిమాకి కూడా మణిశర్మను తీసుకున్నాడు.

హిట్ పెయిర్ రిపీట్

హిట్ పెయిర్ రిపీట్

నాగచైతన్య కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.. హిట్ పెయిర్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.. అంతే కాదు మరో రెండు పెద్ద సినిమాలకు మణిశర్మ సంగీతం అందించనున్నాడట.. దీంతో మణిశర్మ మెల్ల మెల్లగా పుంజుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు..

బిజీ అవుతున్నాడు

బిజీ అవుతున్నాడు

కొన్నేళ్లుగా ఓన్లీ రీ-రికార్డింగ్‌లకే ఎక్కువగా పరిమితమవుతున్న మణిశర్మ.. మళ్లీ ఇప్పుడు సంగీత దర్శకుడిగా బిజీ అవుతున్నాడు. గత ఏడాది 'జెంటిల్ మేన్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మణిశర్మ చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నంత బిజీగా ఇప్పుడు కూడా ఉన్నాడు, తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు మణి శర్మ

 'లై' సినిమా మోషన్ పోస్టర్

'లై' సినిమా మోషన్ పోస్టర్

వంశీ 'ఫ్యాషన్ డిజైనర్', ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అమీ తుమీ', హను రాఘవపూడి 'లై', జయంత్ పరాన్జీ 'జయదేవ్', నారా రోహిత్ - పవన్ మల్లెల చిత్రంతో పాటు పలు సినిమాలకు మణిశర్మే సంగీతాన్ని అందిస్తున్నాడు. మణిశర్మ సంగీతంలోని మహత్తు ఇంకా అలాగే కొనసాగుతోందని చెప్పడానికి ఇటీవలే విడుదలైన నితిన్-హను రాఘవపూడి 'లై' సినిమా మోషన్ పోస్టర్ ఓ ఉదాహరణ. ఈ మూవీ మోషన్ పోస్టర్‌కు.. మణిశర్మ అందించిన ఆర్ఆర్ కేక పుట్టిస్తోంది.

 రీ-రికార్డింగ్‌లోనూ ఎక్స్‌పర్ట్

రీ-రికార్డింగ్‌లోనూ ఎక్స్‌పర్ట్

తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్ర కథానాయకుల సినిమాలకు సంగీతాన్నందించిన మణిశర్మ క్రేజ్ ఒక్కసారిగా తగ్గింది. దీంతో.. రీ-రికార్డింగ్‌లోనూ ఎక్స్‌పర్ట్ అయిన మణిని.. కొంతమంది నిర్మాతలు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కే పరిమితం చేస్తూ వచ్చారు. ఆ విధంగానూ.. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'టెంపర్' వంటి చిత్రాల విజయాల్లోనూ మణిశర్మ పాత్ర ఉందని చెప్పొచ్చు.

సాగర్ మహతి

సాగర్ మహతి

మణిశర్మ తనయుడు సాగర్ మహతి సైతం ఆ మధ్య తండ్రి బాటలో సాగుతూ కొన్ని చిత్రాలకు సంగీతం అందించాడు. అయితే అవేవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. మొత్తానికి మణిశర్మ మరోసారి ఓ వెలుగు వెలిగేందుకు తగ్గ పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయనే చెప్పాలి. మరి మణిశర్మ ఈ సారి ఏ తీరున అలరిస్తాడో చూడాలి.

English summary
Melody Brahma Mani Sharma has made a huge comeback with the successful film Gentleman.there is a buzz that with Gentleman, Mani Sharma will be back to form and might get busy again like his past days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu