»   » మరో మ్యూజికల్ హిట్ కి రెడీగా ఉండండీ.... మ్యూజిక్ సూపర్, మేకింగ్ ఒక అద్బుతం

మరో మ్యూజికల్ హిట్ కి రెడీగా ఉండండీ.... మ్యూజిక్ సూపర్, మేకింగ్ ఒక అద్బుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం కొత్త సినిమా చెలియా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ తో వచ్చిన ఆదియో కాబట్టి మ్యూజిక్ మీద మంచి ఎక్స్పెక్టేషనే ఉన్నా ఈ మధ్య కాలం లో సూపర్ హిట్ అనిపించే ఆల్బం మాత్రం రాలేదు రెహమాన్ నుంచి. గౌతం మీనన్ డైరెక్షన్ లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపోలో ఉన్న చెకోరీ అన్న ఒక్క పాట తప్ప గడిచిన కొన్ని నెలల్లో సూపర్ హిట్ అనదగ్గ ఆల్బం మాత్రం రాలేదు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఒక హార్ట్ టచింగ్ సాంగ్ సెట్ ని ఇచ్చే లాగే ఉన్నాడు రెహమాన్... మణిరత్నం దర్శకత్వం లో వస్తున్న "చెలియా" మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్ అయ్యింది. కార్తీ అదితీ రావ్ కాంబినేషన్ లో చిత్రీకరించిన హంసారో అన్న ఈ సాంగ్ ఇప్పటికే చాలామంది ఫోన్లలోకి డౌన్లోడ్ అయిపోయింది.... ఈ పాట ని చూస్తే ఇంకో మ్యూజికల్ హిట్ మూవీ వస్తున్నట్టే అనిపిస్తోంది.

 టైటిల్ ని మార్చారు:

టైటిల్ ని మార్చారు:


క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం- కార్తీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం తెలుగు వెర్షన్ కు 'డ్యూయెట్' అనే టైటిల్ పెట్టి ఆ మధ్యన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఆ టైటిల్ జనాల్లోకి పెద్దగా వెళ్లటం లేదు అనుకున్నారో ఏమో ...తెలుగు వెర్షన్ టైటిల్ ని మార్చారు.

 తెలుగువెర్షన్ దిల్ రాజు:

తెలుగువెర్షన్ దిల్ రాజు:


ఆ టైటిల్ మరేదో కాదు...చెలియా. తమిళంలో 'కాట్రు వెలియిదై' తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో చెలియా టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అదితిరావు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రెండు..మూడవ షెడ్యూల్స్ కాశ్మీర్‌, చెన్నైలలో జరిగాయి. తెలుగువెర్షన్ ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

కార్తి ఓ సరికొత్త లుక్:

కార్తి ఓ సరికొత్త లుక్:


ఈ సినిమాలో కార్తి ఓ పైలట్ గా నటిస్తున్నాడు. అంతేకాకుండా సినిమాలో కార్తి ఓ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చురుగ్గా జరుగుతుండగా, ఎప్పటిలాగే మణిరత్నం ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే సినిమాలోని కొన్ని కీలక పాత్రల్లో కోలీవుడ్ సీనియర్ నటులు కనిపించబోతున్నారట.

 మంచి అంచనాలే ఉన్నాయి:

మంచి అంచనాలే ఉన్నాయి:


మణిరత్నం కెరీర్లో కొన్ని ప్లాపులు ఉన్నప్పటికీ....ఆయన సినిమాలను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. మణి చివరి సినిమా 'ఓకె కన్మణి'(ఓకే బంగారం) చిత్రం భారీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియా పై మంచి అంచనాలే ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన అదితి రావు హైదరి ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. మణి, కార్తి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి.

 అన్ని సినిమాల్లోనూ:

అన్ని సినిమాల్లోనూ:


మణి రత్నం ఇండియన్ సెల్యులాయిడ్ మీద ఒక అందమైన సంతకం... ఇద్దరూ, అమృత, బొంబాయి లాంటి సిని మాలన్నీ ఒక ఒక రాజకీయ నేపథ్యాన్నీ, సంక్షోబాన్నీ, ఒక సంఘర్షణ నీ బేస్ గా చేసుకొని రాసుకున్న కథలే.., కానీ అన్ని సినిమాల్లోనూ మణిరత్నం మిస్సవనిది ఒక్కటే హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాలో మణి మర్చిపోడు...

 మణిరత్నం ప్రజెంటేషన్ :

మణిరత్నం ప్రజెంటేషన్ :


"ఉరికే చిలకా..." లాంటి సాంగ్ లో పరిగెత్తుకొచ్చే మనీషా కొయిరాలా ఇంకా అలా గుర్తొస్తూనే ఉంటుంది. మణిరత్నం ప్రజెంటేషన్ అలా ఉంటుంది "సఖి" లో షాలిని కళ్ళని, ఆ ఎక్స్ప్రెషన్లనీ ఎప్పటికీ మర్చిపోలేం.... మణిరత్నం ని చాలామందే కొత్త దర్శకులు ఫాలో అయ్యారు.

మణి ఒక్కడికే సాధ్యం:

మణి ఒక్కడికే సాధ్యం:

ముందు హీరోయిన్ పాదాలు చేతులూ, అలా గాలికి ఎగిరే చున్నీ... అందంగా పెద్ద కళ్ళు సీతాకోక చిలుక రెక్కల్లా రెప్పలార్పటం... ఒక్కసారి ప్రేక్షకున్నిఆ అందం ముందు నిలబెట్టేయటం., యావరేజ్ అనిపించే అందాన్ని కూడా అతిలోక సుందరం అనిపించేలా చేయటం మణి ఒక్కడికే సాధ్యం అన్నట్టు అయిపోయింది.

"హంసారో" సాంగ్:

ఇప్పుడు రిలీజ్ అయిన "హంసారో" అంటూ సాగే ఈ సాంగ్ లో మణిరత్నం మ్యాజిక్ రిపీట్ అయ్యేలాగే కనిపిస్తోంది. కార్తీ లుక్ పూర్తిగా కొత్తగా కనిపిస్తూ మరింత యంగ్ గా ఉంటే ఇక అదితీ రావు హైదరీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్శణకానుంది. రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ ఒక్క సారి కాస్త పాత ట్యూన్లని గుర్తు తెచ్చినట్తనిపిస్తూనే కొత్తగా ఉంది. ఇక సాంగ్ మేకింగ్ కూడా మణిరత్నం మార్క్ కనిపిస్తోంది. ఒక్క మాట ఏమిటంటే ఈ సినిమా వచ్చిందీ అంతే అదితీ రావు అనే హీరోయిన్ మాత్రం టాప్ రేజ్ కి వెళ్ళిపోతుంది.

English summary
Music of Maniratnam’s upcoming movie ‘Cheliya’ (Kaatru Veliyidai) will be released shortly. The makers have released a single track titled ‘Hamsaro’. Oscar winner AR Rahman composed soundtrack. Ananth Sriram penned the lyrics of this romantic number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu