»   »  మైమరుపా...! చూస్తే మైమరిచి పోతారు.., రెహమాన్ అద్బుతం

మైమరుపా...! చూస్తే మైమరిచి పోతారు.., రెహమాన్ అద్బుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం కొత్త సినిమా చెలియా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ తో వచ్చిన ఆడియో కాబట్టి మ్యూజిక్ మీద మంచి ఎక్స్పెక్టేషనే ఉన్నా ఈ మధ్య కాలం లో సూపర్ హిట్ అనిపించే ఆల్బం మాత్రం రాలేదు రెహమాన్ నుంచి. గౌతం మీనన్ డైరెక్షన్ లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపోలో ఉన్న చెకోరీ అన్న ఒక్క పాట తప్ప గడిచిన కొన్ని నెలల్లో సూపర్ హిట్ అనదగ్గ ఆల్బం మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక హార్ట్ టచింగ్ సాంగ్ సెట్ ని ఇచ్చే లాగే ఉన్నాడు రెహమాన్...

Maniratnam Cheliya Maimarupa song

మణిరత్నం దర్శకత్వం లో వస్తున్న "చెలియా" మూవీ నుంచి రెండో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. కార్తీ, అదితీ రావ్ కాంబినేషన్ లో చిత్రీకరించిన "మైమరుపా" అన్న వన్ మింట్ సాంగ్ నిన్న రిలీజ్ చేసారు. సాంగ్ ఇప్పటికే చాలామంది ఫోన్లలోకి డౌన్లోడ్ అయిపోయింది.... యూట్యూబ్ లో రెండున్నరలక్షల మంది చూసేసారు. ఈ పాట ని చూస్తే ఇంకో మ్యూజికల్ హిట్ మూవీ వస్తున్నట్టే అనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. కార్తీ ఈ సినిమాలో ఓ యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఇటీవల మైమరుపా వన్ మినిట్ సాంగ్ విడుదల చేశారు. మొత్తానికి మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం కాట్రు వేళయిదై ని బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో చెలియా పేరుతో విడుదల కానుంది.

English summary
Music of Maniratnam’s upcoming movie ‘Cheliya’ (Kaatru Veliyidai) will be released shortly. The makers have released track titled ‘Maimarupa’. Oscar winner AR Rahman composed soundtrack. Ananth Sriram penned the lyrics of this romantic number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu