»   » మహేష్ ప్రాజెక్టుపై మణిరత్నం మౌనం వీడాడు

మహేష్ ప్రాజెక్టుపై మణిరత్నం మౌనం వీడాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్, నాగార్జున కాంబినేషన్ లో మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోలు నాగార్జున, మహేష్ లు సైతం ఖరారు చేసారు. అలాగే మణిరత్నం తరుపున ఆయన భార్య ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు. అయితే ఆ తర్వాత నాగార్జున ...ఈ ప్రాజెక్టు లేనట్లే అని అన్నారు. మహేష్ మాత్రం అటూ ఇటూ గా ఉంది,లేదన్నట్లుగా అన్నాడు. ఈ నేపధ్యంలో మణిరత్నం ఈ ప్రాజెక్టు నిమిత్తం ఏం చెప్తున్నారు అనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే మణిరత్నం మాత్రం పెదవి విప్పలేదు. కాని ఇప్పుడు ఈ చిత్రం విషయమై మౌనం వీడారు.

మణిరత్నం మాట్లాడుతూ... నేను ఇఫ్పటివరకూ ఈ చిత్రం విషయపై ఏంటనేది డిసైడ్ కాలేదు. ఇప్పటికీ స్క్ర్రిప్టు వర్క్ జరుగుతోంది. ఎప్పటికి స్క్రిప్టు వర్క్ పూర్తవుతుందో, ఎప్పుడు సినిమా ప్రారంభిస్తానో చెప్పలేను అన్నారు. తాను ఈ చిత్రం ప్రారంభ సమయంలో పూర్తి డిటేల్స్ తెలియచేస్తాను అన్నారు.

Maniratnam on his multistarrer

ఇక అప్పుడు ఈ చిత్రంపై వచ్చిన వార్తలను మరోసారి గుర్తు చేసుకుంటే... ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. 2014 ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.

English summary

 Earlier there was delightful news about Nagarjuna-Mahesh Babu's multi starrer under the direction of Maniratnam. But later much to the shock of all reports came about the cancellation of the project even as Aishwayra Rai and Shruthi Haasan was talked about as hero-ines in the film. However now Maniratnam responding on the project said he hasn't decided on his next and is still working on the script. He said he doesn’t know when the script will be completed and only after its completion he will reveal the star cast in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu