»   » అలా జరగటానికి కారణం నేనే, నాభర్త మంచివాడే: విడాకుల గుట్టు ఇప్పుడు విప్పింది

అలా జరగటానికి కారణం నేనే, నాభర్త మంచివాడే: విడాకుల గుట్టు ఇప్పుడు విప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

90ల్లో కోట్లాది మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన భామ మనీషా కొయిరాలా. తెలుగులో 'క్రిమినల్'.. తమిళంలో 'భారతీయుడు'.. హిందీలో 'దిల్ సే' లాంటి చిత్రాలతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఇండియన్ సినిమా చరిత్రలో అపురూపమైన అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందింది మనీషా.

మనీషా కొయిరాలా

మనీషా కొయిరాలా

ఓ తరం వెనుక బాలీవుడ్ భామల్లో మనీషా కొయిరాలా రేంజ్ వేరుగా ఉండేది. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి అక్కడి బ్యూటీస్ సంకోచించే రోజుల్లోనే.. సౌత్ సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించేసింది. బాంబాయి.. ఒకే ఒక్కడు.. భారతీయుడు లాంటి ఈమె బ్లాక్ బస్టర్స్ లో ఎక్కువ వాటా సౌత్ సినిమాలదే.

అండాశయ క్యాన్సర్

అండాశయ క్యాన్సర్

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో 2010లో సమ్రాట్ దహల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పుడే ఆమె అండాశయ క్యాన్సర్ తో బాధ పడుతోందనే విషయం బైటపడింది. అక్కడి నుంచి క్యాన్సర్ తో యుద్ధం చేసి గండాన్ని దాటిన మనీషా కొయిరాలా.. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో సెకండ్ ఇన్నిగ్స్ మొదలు పెట్టింది...

సెకెండ్ ఇన్సింగ్స్

సెకెండ్ ఇన్సింగ్స్

తాజాగా ‘డియర్ మాయా' సినిమాతో సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మనీషా మాట్లాడుతూ పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన సమ్రాట్‌ను 2010లో వివాహం చేసుకున్నట్టు చెప్పిన మనీషా పెళ్లి గురించి అందరిలానే ఎన్నో కలలు కన్నానని తెలిపింది.

ఎంతగానో ప్రేమించాను

ఎంతగానో ప్రేమించాను

అయితే వివిధ కారణాల వల్ల 2012లో అతడితో విడాకులు తీసుకున్నాననీ, విడాకుల విషయంలో సమ్రాట్ తప్పు ఏమీ లేదని, తప్పంతా తనదేనని వివరించింది. 'మా వైవాహిక జీవితం నా కారణంగానే విఫలమైంది. వ్యాపారవేత్త సమ్రాట్‌ దహల్‌ను ఎంతగానో ప్రేమించాను. 2010లో నేపాలీ సంప్రదాయంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను.

పెళ్లయిన రెండేళ్లకే

పెళ్లయిన రెండేళ్లకే

ఫేస్‌బుక్ పరిచయంతో మా ప్రేమ మొదలైంది.పెళ్లయిన రెండేళ్లకే అంటే 2012లోనే మా బంధం తెగిపోయింది. ఇందుకు పూర్తి భాద్యత నాదే. నా భర్త సమ్రాట్‌ చాలా మంచివాడు. ఇందులో ఆయన తప్పేం లేదు. అందరు అమ్మాయిల్లాగే ఎన్నో కలలుకన్నాను. కానీ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.

విడిపోవడం ఇద్దరికీ మంచిదని

విడిపోవడం ఇద్దరికీ మంచిదని

బంధం గట్టిపడదని భావిస్తే విడిపోవడం ఇద్దరికీ మంచిదని నా అభిప్రాయం. విడాకుల ఆలోచన నాదే. ఇంకా చెప్పాలంటే పెళ్లి విషయంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. 2012లో విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే క్యాన్సర్ భారిన పడ్డాను. మరుసటి ఏడాది విజయవంతంగా క్యాన్సర్‌ను జయించానని' చెప్పింది.

డియర్ మాయ

డియర్ మాయ

సునైనా భట్నాగర్ డైరెక్షన్‌లో మాయ అనే మహిళ, ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ‘డియర్ మాయ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లలొ భాగంగానే ఈ విషయాలన్నీ చెప్పేసింది మనీషా. అయితే ఇప్పుడు మళ్ళీ తన వివాహాన్ని పునరుద్దరించుకునే ఉద్దేశం కూడా ఏమీలేదట దాదాపు ఇక ఒంటరిగానే తన శేష జీవితాన్ని గడిపేస్తుందట.

English summary
“I take full responsibility of hurrying up and wanting to get married and then realising I am not meant for this. There is no fault from another side, the fault is mine,” Manisha told
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X