»   » మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాల

మోదీ కి ధాంక్స్ చెప్పిన మనీషా కొయరాల

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: 'నేపాల్ ను చూశాక నా కళ్లలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా సహాయం అంధించిన భారత్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇంత తొందరగా స్పందించి చేసిన సాయాన్ని అన్ని వేళలా మా గుండెల్లో గుర్తుంచుకొని ఉంటాం.. ధన్యవాదాలు ప్రధాని నరేంద్ర మోదీ' గారు అంటూ ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నేపాల్ ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించిన భారత ప్రధాని నరేంద్రమోదీకి బాలీవుడ్ నటి, నేపాల్ కు చెందిన మనీషా కోయిరాలా ధన్యవాదాలు తెలిపింది. టీవీలో నేపాల్ దుర్ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యానని, నేపాల్ ను ఆదుకునేందుకు వెంటనే కదిలిన భారత్ కు ఎంతమేర ధన్యవాదాలు చెప్పినా సరిపోవని అన్నారు.

Manisha Koirala Thanks PM Narendra Modi

ఒకప్పుడు వెండితెరను ఏలిన మనీషా కొయిరాలా ఆ మధ్యన కాన్సర్ తో భాధపడి దూరమయ్యారు. ఇఫ్పుడు కోలుకుని మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో కనిపించటానికి సన్నాహాలు చేస్తోంది. చిత్రం పూర్తి వివరాలు క్రింద చదవండి...

'కుప్పి', 'వనయుద్ధం' వంటి చిత్రాల తర్వాత ఏఎంఆర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఒరు మెల్లియ కోడు'. ఇందులో అర్జున్‌ హీరోగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్యామ్‌ నటిస్తున్నారు. అక్షాభట్‌ హీరోయిన్. మనీషా కొయిరాలా చాలా గ్యాప్‌ తర్వాత నటిస్తున్నారు.

ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూందమల్లి సమీపంలో తెరకెక్కించారు.

దర్శకుడు ఏఎంఆర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పూందమల్లి సమీపంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సెట్‌ను లక్షలాది రూపాయలతో రూపొందించాం. సినిమాలోని ప్రధాన సన్నివేశాలన్నీ ఈ సెట్‌ దగ్గరే చిత్రీకరిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ అర్జున్‌, శ్యామ్‌, మనీషా కొయిరాలాకు సంబంధించి సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉంటాం. ఆ తర్వాత చెన్నైలో షూటింగ్‌ జరుపుతామన్నారు.

నటుడు అర్జున్‌ మాట్లాడుతూ.. నా కెరీర్‌లోనే చాలా భిన్నమైన సినిమా ఇది. తర్వాతి 20 సంవత్సరాల పాటు ఈ సినిమా తప్పకుండా నా ప్రతిభను చాటుతుంది. ఇలాంటి సినిమాలో నటిస్తున్నప్పుడు తెలియని ఆనందం.. నన్ను ఆకాశానికెత్తుతోందని చెప్పారు.

English summary
Bollywood actress Manisha Koirala, who has her roots in Nepal, has thanked India and Prime Minister Narendra Modi for quickly coming to Nepal's help after the devastating earthquake. Manisha was in tears while watching the news of the destruction on TV after a 7.9-magnitude quake left over 1,900 people dead.
Please Wait while comments are loading...