అండాశయ కేన్సర్ అంటూ మనీషా కొయిరాలా ప్రకటన

సుబ్రతో ఘోష్ మాట్లాడుతూ... ''అండాశయ కేన్సర్ సోకిన మనీషాకు గురువారం న్యూయార్క్‌లో శస్త్రచికిత్స జరిగింది'' అని వివరించారు. గతనెల 28న ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మనీషాకు కేన్సర్ సోకిందంటూ అప్పడు వదంతులు వచ్చాయి. తాజాగా అవి నిజమేనని తేలింది. తనకు కేన్సర్ రావడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని, అయితే త్వరలోనే కోలుకుంటానని మనీషా విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లోని తన పేజీలో ఓ సందేశం పోస్ట్ చేశారు.
తన కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరూ సంతోషంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ఇదంతా జీవితంలో ఓ భాగమని, ఎవరూ బాధపడొద్దని తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, క్షేమంగానే ఉంటానని చెప్పారు. 1991లో సౌదాగర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన మనీషా.. దిల్‌సే, 1942: ఎ లవ్ స్టోరీ వంటి సినిమాలతో బాగా పేరు సంపాదించారు. ఇటీవల విడుదలైన రాంగోపాల్‌వర్మ 'భూత్ రిటర్న్స్' సినిమాలో నటించడం ద్వారా మనీషా నటనలో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











