»   »  కొత్త పోస్టర్‌ విడుదల...మంచి స్పందన

కొత్త పోస్టర్‌ విడుదల...మంచి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఒంటరిగా శ్రమించి ఓ పర్వతాన్ని బద్దలు కొట్టి దారి నిర్మించిన వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌'. ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మంచి స్పందన వస్తోంది. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి.

ట్రైలర్ కు,ఫస్ట్ లుక్ కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఓపినిగ్స్, సినిమా బిజినెస్ అంచనా వేసే రోజులు ఇవి. అందుకే ట్రైలర్ నుంచి అన్ని జాగ్రత్తులూ తీసుకుంటున్నారు. తాజాగా 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌' చిత్రం ట్రైలర్‌ సోమవారం రాత్రి విడుదలైంది. ఈ ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Manjhi - The Mountain Man -new poster


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 9 లక్షల మంది వీక్షించడం విశేషం. ప్రేమ కోసం పర్వతాన్ని తొలిచి దారిని ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌'. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కేతన్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. వయోకాం 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తన బాహువులుతో ...22 సంవత్సరాలు పాటు శ్రమించి కొండను తవ్విన వీరుడి నిజ జీవిత కథ ఇది. ఆ ట్రైలర్ మరోసారి చూడండి...

మాంఝీ జీవిత కథను దర్శకుడు కేతన్‌ మెహతా 'మాంఝీ' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. వచ్చే నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. 

ఇంతకీ 'మాంఝీ' ఎవరూ అంటారా... భార్యపై తనకున్న ప్రేమతో ఏకంగా కొండనే తవ్వేశాడు బిహార్‌కు చెందిన దశరథ్‌ మాంఝీ. ఆయన గ్రామం కొండప్రాంతంలో ఉండటంతో సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై మరణించింది.

దీంతో చలించిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఈ కథతో చిత్రం వస్తోంది.

English summary
Nawaz, released the first look of the film on his Twitter handle and he is sure set to kill as Manjhi - a man who literally broke a mountain for love.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu