»   »  ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్...ఓపినింగ్స్ అదురుతాయ్

ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్...ఓపినింగ్స్ అదురుతాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ట్రైలర్ కు,ఫస్ట్ లుక్ కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఓపినిగ్స్, సినిమా బిజినెస్ అంచనా వేసే రోజులు ఇవి. అందుకే ట్రైలర్ నుంచి అన్ని జాగ్రత్తులూ తీసుకుంటున్నారు. తాజాగా 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌' చిత్రం ట్రైలర్‌ సోమవారం రాత్రి విడుదలైంది. ఈ ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 9 లక్షల మంది వీక్షించడం విశేషం. ప్రేమ కోసం పర్వతాన్ని తొలిచి దారిని ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌'. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కేతన్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. వయోకాం 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తన బాహువులుతో ...22 సంవత్సరాలు పాటు శ్రమించి కొండను తవ్విన వీరుడి నిజ జీవిత కథ ఇది. ఆ ట్రైలర్ మరోసారి చూడండి...

మాంఝీ జీవిత కథను దర్శకుడు కేతన్‌ మెహతా 'మాంఝీ' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. వచ్చే నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.

Manjhi

ఇంతకీ 'మాంఝీ' ఎవరూ అంటారా... భార్యపై తనకున్న ప్రేమతో ఏకంగా కొండనే తవ్వేశాడు బిహార్‌కు చెందిన దశరథ్‌ మాంఝీ. ఆయన గ్రామం కొండప్రాంతంలో ఉండటంతో సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై మరణించింది.

దీంతో చలించిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఈ కథతో చిత్రం వస్తోంది.

English summary
Viacom18 Motion Pictures presents in association with NFDC and Maya Movies: Manjhi -The Mountain Man, releasing on August 21st, 2015. The trailer got huge response from fans in not over India...all over world. A film by Ketan Mehta starring versatile actor Nawazuddin Siddiqui in and as Manjhi along with Radhika Apte playing his beloved wife, this biopic is the story of an ordinary man who performed the extraordinary.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu